బిగ్ బాస్ సీజన్ 3 మరో పది రోజుల్లో పూర్తి కానుంది. దీంతో టాస్క్ లను కాస్త ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి ఫైనల్స్ లో ఉండడానికి ఎవరు అర్హులో, ఎవరు కారో వివరించి చెప్పాల్సి వుంటుంది. ముందుగా గార్డెన్ ఏరియాలో కొన్ని కలర్ బౌల్స్ వాటి మీద కొన్ని పేర్లు రాసి ఉంటాయి. 

శివజ్యోతి చేతిలో వరుణ్ కలర్ బౌల్, బాబా చేతిలో అలీ కలర్ బౌల్, శ్రీముఖి చేతిలో శివజ్యోతి కలర్ బౌల్, వరుణ్ చేతిలో బాబా కలర్ బౌల్, అలీ చేతిలో శ్రీముఖి కలర్ బౌల్ ఉంది. నాలుగు బజర్స్ మోగిన తరువాత ఎవరైతే క్లీన్ గా ఉంటారో వారికి ఆడియన్స్ ని ఓట్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో బాబా తనకు అలీపై ఉన్న కంప్లైంట్ చెప్పి అతడిపై రంగు వేశాడు.

 

శ్రీముఖి... శివజ్యోతి నామినేషన్ అంటే భయపడుతుందని ఆమె ఫైనల్స్ కి అర్హురాలు కాదని ఆమెపై రంగు వేసింది. ఆ తరువాత శివజ్యోతి... వరుణ్ పై రంగు వేస్తూ కొన్ని కారణాలు చెప్పింది. వరుణ్ తనకు ఇంట్లో గౌరవం ఇవ్వలేదని, హేళనగా మాట్లాడాడని కారణాలు చెప్పి అతడిపై రంగు వేసింది. ఫైనల్ గా ఈ టాస్క్ లో శ్రీముఖి క్లీన్ గా బయటపడింది. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు. మీ జీవితంలో ఉన్న డార్క్ సీక్రెట్స్ ని షేర్ చేసుకోవాలని చెప్పారు. వరుణ్ గోవాలో తను ఎదుర్కొన్న ఓ పరిస్థితిని వివరించాడు.

 

ఇక శ్రీముఖి తన బ్రేకప్ విషయాలు చెప్పి షాకిచ్చింది. తన వ్యక్తిగత విషయాలను పరిమితంగానే ఉంచుతానని చెప్పిన శ్రీముఖి బ్రేకప్ స్టోరీ చెప్పి ఓ మెసేజ్ ఇచ్చింది. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉండేదాన్ని అని చెప్పిన శ్రీముఖి అదే సమయంలో ప్రొఫెషనల్ గా కూడా క్లిక్ అయ్యానని చెప్పింది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బాగుందని అనుకుంటున్న సమయంలో రిలేషన్షిప్ లో మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ అయిందని శ్రీముఖి తెలిపింది.

ఆ సమయంలో చచ్చిపోదామని అనుకున్నానని, ఆ బాధని భరించలేకపోయానని వెల్లడించింది. అయితే తను ప్రేమించిన వ్యక్తి ఎవరనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు.  మనకంటూ మెచ్యూరిటీ లెవెల్ బాగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ అనేది పెట్టుకోవాలని.. ఫస్ట్ అయితే ఆర్థికంగా, కెరీర్ పరంగా ఎదగాలని అందరికీ సూచించింది.