ప్రముఖ మోడల్, నటి గెహానా వశిష్ట (31) తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గురువారం నాడు ఆమెకి గుండెపోటు రావడంతో వెంటనే ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఓ వెబ్ సిరీస్ కోసం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ చేయడం వలనే ఇలానే జరిగిందని అంటున్నారు.

షూటింగ్ సమయంలో బీపీ తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగెహానా సన్నిహితులు తెలిపారు. ఫుడ్ తీసుకోకుండా కేవలం డ్రింక్స్ తీసుకుంటూ షూటింగ్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

కోరికలు తీర్చమని అడిగేవారు.. లొంగలేదని.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమెని వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హాస్పిటల్ కి తీసుకొచ్చే సమయానికే ఆమె నాడీ కొట్టుకోవడం ఆగిపోయిందని.. దీంతో ఎలక్ట్రిక్ షాక్ ద్వారా గుండె కొట్టుకునేలా చేశానని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెని శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని.. గెహానాను బతికించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

ఆమెకి షుగర్ ఉండడం, ఆహారం తీసుకోకుండా ఉండడం వలన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని చెప్పారు. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన గెహానా టీవీ ప్రెజెంటర్ గా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట సీరియల్స్ లో కనిపించిన గెహానా.. హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. తెలుగులో 'ప్రేమించు పెళ్లాడు', 'నమస్తే', 'ఐదు', 'బీటెక్ లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో నటించారు.