సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని.. దాని కారణంగా ఎన్నో వేధింపులకు గురయ్యామంటూ ఇప్పటికే చాలా మంది నటీమణులు మీడియా ముందుకు వచ్చారు. తాజాగా నటి మంజరి ఫడ్నిస్ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది.

ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పిన ఈమె తను నటించిన సినిమాల కంటే పోగొట్టుకున్న సినిమాలే ఎక్కువ ఉన్నాయని చెప్పింది. దానికి కారణం దర్శకనిర్మాతలకు లొంగకపోవడమేనని చెబుతోంది. వారి కోరికలు తీర్చలేదని సినిమాల నుండి తొలగించేవారని చెప్పుకొని వాపోయింది.

(2010-2019) కథలతో షాక్ ఇచ్చిన సినిమాలు.. హిట్టు, ఫట్టూ రెండూ!

కేవలం కాస్టింగ్ కౌచ్ కారణంగా భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమా ల్లో అవకాశాలు కోల్పోయానని తెలిపింది. తన కెరీర్ లో చాలా వరకు చిన్న సినిమాల్లోనే నటించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల వలన చాలా కాలం డిప్రెషన్ లో ఉండిపోయానని చెప్పింది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయని షాకింగ్ కామెంట్స్ చేసింది.

అయితే ఎవరూ బలవంతం చేయరని.. కానీ తన ఆత్మాభిమానా న్ని కోల్పోలేక ఎందరో నిర్మాతల సినిమాలను రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. కొన్ని కొన్ని సార్లు సినిమాకి సైన్ చేసిన తరువాత కోరికలు తీర్చమని అడిగేవారని.. దీంతో అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బుని తిరిగిచ్చేసి సినిమాల నుండి తప్పుకున్నట్లు తెలిపింది.

 

దక్షిణాదికి చెందిన ఓ అగ్ర నిర్మాత తనకు ఫోన్ చేసి సినిమా ఆఫర్ ఇస్తే నాకేంటని అడిగారని.. కష్టపడి పని చేస్తానని చెబితే అది తనకి అనవసరమని చెప్పాడని.. అప్పుడే అతడి తప్పుడు ఉద్దేశం తనకు అర్ధమైందని వెల్లడించింది.

అవకాశాల కోసం సెక్స్ కి ఒప్పుకునే అమ్మాయిని కాదని ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసే ఉంటుందని.. అందుకే తనకు అవకాశాలు రావడం లేదని సంచలన కామెంట్స్ చేసింది.  ఈ బ్యూటీ గతంలో అల్లరి నరేష్ తో కలిసి రెండు చిత్రాల్లో నటించింది. అలానే ఎన్టీఆర్ నటించిన 'శక్తి' సినిమాలో కీలకపాత్ర పోషించింది.