దేశంలో మహిళలపై అకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక నటిపై పోకిరి తన ప్రతాపం చూపించాడు. దీంతో పోలీసులు అతడి అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ టీవీ నటి హర్షితా కశ్యప్ తన స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళ్లడానికి లోకల్ రైల్వే స్టేషన్ కి వెళ్లింది.

అక్కడ తన స్నేహితురాలు టికెట్ కౌంటర్ దగ్గర నిలబడి ఉండగా.. హర్షితాను ఒక వ్యక్తి చూస్తూ నిలబడ్డాడు. మొదట ఆ విషయాన్ని పట్టించుకోని హర్షితా ఆ వ్యక్తి తమను ఫాలో అవుతుండడంతో.. ఎందుకు ఫాలో చేస్తున్నావని ప్రశ్నించింది. దీంతో అతడు ఆమెపై దాడికి దిగాడు.

ముదురు హీరోల రొమాన్స్ పై సోనాక్షి సిన్హా హాట్ కామెంట్స్!

ముందుగా హర్షితా స్నేహితురాలిని ఆ తరువాత హర్షితను అసభ్యంగా తాకుతూ వారిపై చేయి చేసుకున్నాడు. దీంతో హర్షితా అతడిని ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఈ ఘటన ముంబైలోని చరనీ రోడ్డు రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. షారూఖ్ షేక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి హర్షితా, ఆమె స్నేహితురాలిపై దాడికి దిగారు.

ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు షారూఖ్ షేక్ ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత ఆ వ్యక్తి ఏడ్చాడని, అతడి చెల్లెలు స్టేషన్ కి వచ్చి కేసు పెట్టొద్దని తమను వేడుకుందని హర్షితా చెప్పుకొచ్చింది.

కానీ ఇలాంటి వాళ్లను వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని అతడిపై కేసు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. దాడికి గురైన నటి హర్షితా కశ్యప్ ఈ దాడికి సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.