టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యాభై, అరవై ఏళ్ల వయసు వచ్చిన హీరోలు కూడా కుర్ర భామలతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. తెరపై ఈ సన్నివేశాలు చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నా.. హీరోలు మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సినిమాలో కూడా 53 ఏళ్ల సల్మాన్ 21 ఏళ్ల సాయి మంజ్రేకర్ తో కలిసి నటించారు. ఈ జంటపై సోనాక్షి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ముందుగా ఓ విలేకరి.. ''మాధురి దీక్షిత్.. కుర్ర హీరో ఇషాన్ ఖట్టర్ తో రొమాన్స్ చేస్తే ఎవరైనా చూస్తారా..?'' అని ప్రశ్నించగా దానికి సోనాక్షి.. ''అదైతే తెలియదు కానీ.. ఆ కాంబినేషన్ విచిత్రంగా అనిపిస్తుంది'' అని చెప్పింది.

పాయల్ ని పక్కకి తోసేసిన 'వెంకీ మామ'..?

దీంతో ఆ విలేకరి.. ''అలాంటప్పుడు 53 ఏళ్ల సల్మాన్‌తో 21 ఏళ్ల యువతి రొమాన్స్ చేస్తే ఎందుకు విచిత్రంగా అనిపించదు?'' అని ప్రశ్నించాడు. దానికి సొనాక్షి కచ్చితంగా విచిత్రంగానే అనిపిస్తుందని.. కానీ ఆ విషయం సల్మాన్ ని అడగాలని, 53 ఏళ్ల వయసులోనూ ధృడంగా ఉంటూ, యవ హీరోయిన్లతో ఎలా రొమాన్స్ చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పారు.

అయితే తానెప్పుడూ ఈ విషయం గురించి ఆలోచించలేదని.. తనవరకు ఇది ఒక జాబ్ అని చెప్పింది. కొన్నేళ్లుగా సల్మాన్ తన కెరీర్ మెరుగుపరుచుకుంటూ సత్తా 
చాటుతున్నారని.. ఆయన సరసన నటించాలని చాలా మంది అనుకుంటారని చెప్పింది. తనకే గనుక యాభై ఐదేళ్లు వచ్చాకా సినిమాల్లో నటించే అవకాశం ఉంటే, అప్పుడు ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో తెరపై రొమాంటిక్ సీన్లలో నటించనని వ్యంగ్యంగా చెప్పుకొచ్చింది.