బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, సీనియర్ నటి మలైకా అరోరాలు చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. కొత్త ఏడాదిలో వారిద్దరూ తమ ప్రేమని అధికారికంగా ప్రకటించేశారు. న్యూఇయర్ సందర్భంగా మలైకా, అర్జున్ ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఆ సమయంలో ఓ ఫోటో తీసుకున్నారు.

మలైకా.. అర్జున్ బుగ్గపై ముద్దుపెడుతూ ఉన్న ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ జంటని ఎప్పుడు తమ ప్రేమ గురించి ప్రశ్నించినా.. సమాధానం దాటవేస్తూ వచ్చారు. గతేడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని మలైకా వెల్లడించింది.

హీరోయిన్ బికినీ పిక్స్.. సూపర్ హాట్ కి నెక్ట్స్ లెవెల్!

ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం బీచ్ వెడ్డింగ్ చేసుకుంటానని గతంలో ఓసారి చెప్పింది. ఇప్పుడు ఈ జంట షేర్ చేసిన ఈ ఫోటో చూసిన నెటిజన్లు మలైకాని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మొదటినుండి కూడా వీరి కాంబినేషన్ పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి కారణం మలైకా వయసులో అర్జున్ కపూర్ కంటే చాలా పెద్దది.

పైగా ఆమెకి టీనేజర్ అయిన కొడుకు కూడా ఉన్నాడు. అలాంటిది ఆమె అర్జున్ కపూర్ లాంటి కుర్ర హీరోతో డేటింగ్ చేయడంపై విమర్శలు వినిపించేవి. ఇప్పుడు ఏకంగా అర్జున్ ని ముద్దు పెడుతూ ఉన్న ఫోటో షేర్ చేసింది. మరి నెటిజన్లు ఊరుకుంటారా..? మలైకాని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

పిల్లాడితో ఆంటీ రొమాన్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ఆంటీ బాగా ఎంజాయ్ చేస్తుందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అలానే వీరిద్దరినీ విష్ చేసేవాళ్లు కూడా ఉన్నారు కానీ ఎక్కువ శాతం విమర్శలే వస్తున్నాయి. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sun,star,light,happiness.......2020✨

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Jan 1, 2020 at 1:29am PST