'జబర్దస్త్' షో నుండి మెగాబ్రదర్ నాగబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు ఎందుకు తప్పుకున్నారనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ విషయంపై నాగార్జున స్వయంగా క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. 

మూడు రోజుల క్రితం తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో వీడియో ద్వారా తాను 'జబర్దస్త్' షో నుండి తప్పుకుంటున్న మాట నిజమేనని వెల్లడించారు. సైద్ధాంతిక పరమైన విభేదాల కారణంగా తాను ఈ షో నుండి బయటకి వచ్చినట్లు చెప్పారు.

గడ్డం పెంచు.. హిట్టు కొట్టు.. హీరోల నయా ఫార్ములా!

'జబర్దస్త్' షోతో తనకున్న బాండింగ్, ఆ షోతో తన జర్నీ సాగిన తీరు ఇలాంటి విషయాలపై మాట్లాడిన నాగబాబు తాను షో నుండి బయటకి ఎందుకు రావాల్సిందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ విషయం గురించి తరువాత వివరిస్తానని చెప్పారు. అలా చెప్పిన తరువాత తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు నాగబాబు.

ఈ వీడియోలో అయినా.. నాగబాబు తన ఎగ్జిట్ కి సంబంధించిన విషయాలపై కామెంట్స్ చేస్తాడేమో అనుకుంటే.. అలా కాకుండా 'జబర్దస్త్' షో గురించి అతడి ప్రయాణం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. పాతిక ఎపిసోడ్లని చెప్పి ఇన్నేళ్లు షో నడిపించారని ఏదేదో చెప్పుకొచ్చాడు. కానీ జనాలకు కావాల్సిన కంటెంట్ మాత్రం చెప్పలేదు.

మిగిలిన విషయాలు తరువాతి వీడియోలో చెబుతానని అన్నాడు. దానికి సంబంధించిన ప్రోమో చూస్తే.. అందులో రచ్చ రవి యాక్సిడెంట్ ఇంకా ఏవో చెబుతున్నాడు. కానీ అసలు మేటర్ చెప్పినట్లు లేడు.

చూస్తుంటే నాగబాబు దీన్ని వెబ్ సిరీస్ ల మాదిరి ఓ పది ఎపిసోడ్ లు షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాడేమో.. అయితే ఈ వీడియోలపై మాత్రం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  సీరియల్ మాదిరి విషయం చెప్పకుండా ఇలా నస పెడుతూనే ఉంటావా..? అంటూ నాగబాబుని ప్రశ్నిస్తున్నారు.