సినిమా రిలీజ్ కి ముందు ఎంతైనా ప్రమోషన్స్ చేసుకోవచ్చు.. కానీ రిలీజైన తరువాత మాత్రం సినిమాకి వచ్చే టాక్ ని బట్టి వ్యవహరించాలి. ఈ మధ్య ఫ్లాప్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్ లు పెట్టుకొని కొందరు మేకర్స్, హీరోలు విమర్శలపాలయ్యారు.

ఇప్పుడు 'RX 100' హీరో కార్తికేయ కూడా అదే పని చేస్తున్నాడు. రీసెంట్ గా అతడు నటించిన '90ml' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజే సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఎక్కడా పాజిటివ్ రివ్యూ అనేదే లేదు. చెత్త సినిమా అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేశారు.

నటితో ఎఫైర్ పెట్టుకున్న హీరో.. నిజం బయటపెట్టిన స్టార్ హీరో!

ఈ  క్రమంలో కార్తికేయ సైలెంట్ గా ఉండకుండా.. సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్ అంటూ ప్రకటించాడు. దీంతో నెటిజన్లు అతడిని టార్గెట్ చేశారు. థియేటర్ నుండి బయటకి వచ్చాక నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదని కొందరు అంటే.. 90ml చూసిన తరువాత కచ్చితంగా ఫుల్ కొట్టాల్సిందే అంటూ మరికొందరు 
కామెంట్స్ చేస్తున్నారు.

మాస్ హీరో అవ్వాలనే తాపత్రయంలో కథ, కథనాల సంగతి గాలికి వదిలేశాడంటూ కొందరు సీరియస్ గా కార్తికేయను విమర్శిస్తున్నారు. మందు కొట్టి కథ విన్నావా..? అంటూ కార్తికేయని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కార్తికేయపై ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. కానీ యూనిట్ మాత్రం వెనుకడుగు వేయకుండా.. ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం బి, సి సెంటర్లపై దృష్టి పెట్టారు.