బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న 'బిగ్ బాస్' సీజన్ 13 టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఈ షోలో ఇద్దరి మధ్య ఉన్న ఎఫైర్ చిచ్చు రేపింది. ఈ షోలో అర్హాన్ ఖాన్, రష్మి దేశాయ్ అనే ఇద్దరు బుల్లితెర నటులు కంటెస్టంట్ లుగా పాల్గొన్నారు.

హౌస్ లోకి వచ్చిన కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య ఇష్టం ఏర్పడింది. అర్హాన్ ఎలిమినేట్ అయిన రోజు రష్మి బాగా ఏడ్చేసింది. అయితే మరోసారి అర్హాన్ ని హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్. దాంతో రష్మి, అర్హాన్ లు మరింత క్లోజ్ అయిపోయారు. ఈ షోలో అర్హాన్.. రష్మికి ప్రపోజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇది ఇలా ఉండగా.. వీరిద్దరి రిలేషన్షిప్ లో బాంబ్ పేల్చాడు సల్మాన్ ఖాన్. అర్హాన్ కి ఇదివరకే పెళ్లైందని తెలుసుకున్న సల్మాన్ షోలో అతడిని ప్రశ్నించాడు. స్టేజ్ పై కోపంగా నిల్చొని ఉన్న సల్మాన్.. అర్హాన్ ని ఉద్దేశిస్తూ.. 'అర్హాన్ నీకు బయటి ప్రపంచం గురించి మాట్లాడటమంటే చాలా ఇష్టం కదా.. ఇప్పుడు నీ ప్రపంచం గురించి మాట్లాడుకుందాం.. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు..?' అని ప్రశ్నించాడు.

దానికి అర్హాన్ టెన్షన్ పడుతూ.. 'నేను, అమ్మా నాన్న.. సిస్టర్' అని చెప్పాడు. ఇంకా ఎవరు ఉంటారని ఆవేశంగా అడిగాడు సల్మాన్.. దానికి అర్హన్ బ్రదర్ కూడా ఉంటాడని చెప్పాడు. ఇంకా ఎవరు ఉంటారని మరోసారి అడిగాడు సల్మాన్. అర్హాన్ ని ఏం జరుగుతుందో అర్ధం కాక సైలెంట్ గా ఉండిపోయాడు.

2019లో అభిమానులను మోసం చేసిన స్టార్ హీరోలు

దీంతో సల్మాన్ కోపంగా.. 'నీ భార్య, బిడ్డ గురించి రష్మికి చెప్పలేదా..?' అని అడిగాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ మాట విన్న రష్మి ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. తనకు సంబంధించిన అన్ని విషయాలు అర్హాన్ కి తెలుసునని.. కానీ తన దగ్గర అర్హాన్ ఇంత పెద్ద విషయం దాచాడని ఎమోషనల్ అయింది.

దానికి అర్హాన్ ప్రస్తుతం తను ఎలాంటి రిలేషన్ లో లేనని.. భార్య, బిడ్డలతో కూడా బంధాలు తెగిపోయాయని.. తన లైఫ్ లో చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశానని చెప్పాడు. అయినప్పటికీ రష్మి బాధని కంట్రోల్ చేసుకోలేకపోయింది. దీంతో సల్మాన్ స్వయంగా బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్లి రష్మిని ఓదార్చాడు.