యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై క్రమంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఇటీవల బాలీవుడ్ క్రేజీ హీరో అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కావడంతో మరింతగా అంచనాలు ఎక్కువయ్యాయి. 

సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు లేకుండగా రాజమౌళి జాగ్రత్త పడుతున్నారు. అయినా కూడా లీకుల బెడద తప్పడం లేదు. ఇటీవల ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తున్న పిక్ ఒకటి సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనితో వేగంగా స్పందించిన రాజమౌళి సెట్స్ లో మరింతగా సెక్యూరిటీ పెంచినట్లు సమాచారం. 

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మరో లీక్ బయటకు వచ్చింది. కాకపోతే ఈ సారి ఈ చిత్రంలో నటిస్తున్న నటుడే కొన్ని ఆసక్తికర విషయాలని బయట పెట్టాడు. ఛత్రపతి చిత్రంలో ప్రభాస్ కు ఫ్రెండ్ గా నటించిన శేఖర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఛత్రపతి శేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్ ఆర్ ఆర్ గురించి ఫ్యాన్స్ పండగచేసుకునే విషయాలు వెల్లడించాడు. 

నేను ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు గెటప్పులో నటిస్తున్నారు. సినిమా మొత్తం ఆయన పక్కన ఉండే పాత్రలో నేను నటిస్తున్నాను అని శేఖర్ తెలిపాడు. రామ్ చరణ్ తో కూడా ఒక సన్నివేశంలో నటించా. అంతకు మించి వివరాలేమీ నేను చెప్పలేను. వారిద్దరూ ఎలాంటి గెటప్పుల్లో ఉంటారనేది కూడా చెప్పకూడని విషయం అని శేఖర్ తెలిపాడు. 

బాలయ్యకు ఏంటీ తలనొప్పి.. బోయపాటికి మూవీకి బిగ్ ట్రబుల్!

శేఖర్ చెప్పిన అంశాలు ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకునేవే. ఇటీవల అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కాగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ముగ్గురూ అజయ్ దేవగన్ తో దిగిన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

టాలీవుడ్ స్టార్ హీరోల బలహీనతలు ఏంటో తెలుసా.. ఓ లుక్కేయండి!

చరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. జులై 30న ఈ చిత్రం విడుదల కావలసి   ఉండగా వాయిదా పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

'RRR' స్పెషల్ లుక్.. ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు హీరోలు