ఏపీ రాజధాని అంశం.. రాజకీయ క్షేత్రం నుంచి సినిమా రంగానికి తాకింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ విద్యార్ధి యువజన పోరాట సమితి.. హీరో మహేష్ బాబు ఇంటి ముందు నిరసనలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈరోజు నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట  ఆందోళన చేస్తామంటూ ప్రకటించారు. వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలని.. కర్నూలులో హైకోర్టు అమరావతి వైజాగ్ లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం కల్పించాలని, ఏపీ పునర్విభజన చట్టంలోని విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బెజవాడ: చంద్రబాబు సహా అమరావతి జేఏసీ నేతల అరెస్ట్, ఉద్రిక్తత

ఈ మేరకు జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి పోరాటానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జిలాని వెల్లడించారు. 

పోరాటంలో భాగంగా ముందుగా హీరో మహేష్ బాబు ఇంటి ముందు ధర్నాకి దిగారు. ప్రస్తుతం మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల నేపధ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు మహేష్ బాబు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఆయన స్పందిస్తారో లేదో.. చూడాలి! 

ఆ యాక్టర్ నన్ను టార్గెట్ చేశాడు.. కావాలనే తొక్కేశాడు.. శివారెడ్డి