దర్శకుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సివుంది. మూడేళ్ల క్రితం వెంకటేష్ పుట్టినరోజు నాడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. హారిక హాసిన రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించాలని అనుకున్నారు.

కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈసారి పుట్టినరోజుకి అలాంటి పోస్టర్ కూడా ఏదీ రిలీజ్ చేయలేదు. నిజానికి త్రివిక్రమ్ తో వెంకటేష్ కాంబినేషన్ కి చాలా క్రేజ్ ఉంది. 'ఎఫ్ 2' సినిమా తరువాత వెంకీలో కామెడీ యాంగిల్ అలానే ఉందని గ్రహించిన దర్శకులు అతడితో సినిమాలు చేయాలనుకుంటున్నారు.

కొత్త అవతారం ఎత్తబోతున్న క్రేజీ బ్యూటీ.. ఆ హీరోతో కలసి ఏం చేయబోతోందంటే..

ఇదే జోరులో త్రివిక్రమ్ గనుక వెంకీతో సినిమా తీస్తే అది భారీ హిట్ అవ్వడం ఖాయం. అయితే త్రివిక్రమ్ మాత్రం వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరోలతో తప్ప మిగతా వారితో సినిమాలు చేయడం లేదు. త్రివిక్రమ్ తో పని చేయాలని కోరుకుంటున్న యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఆ పని చేయడం లేదు.

పవన్ తో తీసిన 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ అయిన తరువాత త్రివిక్రమ్ మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేస్తున్నాడనే మాటలు వినిపించినా.. అతడు మాత్రం స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత', అల్లు అర్జున్ తో 'అల.. వైకుంఠపురములో' లాంటి ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు.

'అల.. వైకుంఠపురములో' సినిమా తరువాత కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అంగీకరించినట్లు టాక్. అలానే మహేష్ బాబు, చరణ్ తో సినిమాలు చేస్తానని మాటిచ్చాడు. ఈ క్రమంలో వెంకటేష్ తో సినిమా అంటే సాధ్యమయ్యే పనిలా అనిపించడం లేదు.