తెలుగు, తమిళ చిత్రాలతో దక్షిణాదిలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది రెజీనా. రెజీనా చివరగా తెలుగులో నటించిన చిత్రం 'ఎవరు'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రెజీనా తనలోని నెగిటివ్ యాంగిల్ ని బయటపెట్టింది. రెజీనా పాత్రకు ప్రశంసలు దక్కాయి. 

ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాలతో రెజీనా బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం త్వరలో చెన్నైలో జరుగనుంది. ఈ అవార్డ్స్ వేడుకకు రెజీనా హోస్ట్ గా వ్యవహరించనుండడం విశేషం. రేజీనాతో పాటు హీరో సందీవ్ కిషన్ కూడా హోస్టింగ్ చేయనున్నాడు. 

రారా కృష్ణయ్య చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుకపై వీరిద్దరి జంట బావుంటుందనే ఆలోచనతో నిర్వాహకులు రెజీనా, సందీప్ కిషన్ ని ఎంపిక చేశారు. 

ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుకకు నటీనటులు హోస్ట్ లుగా వ్యవహరిస్తుంటారు. ఈసారి ఆ అవకాశం రెజీనా, సందీప్ కు దక్కింది. సందీప్ కిషన్ చివరగా తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ప్రస్తుతం ఈ హీరో హాకీ నేపథ్యంలో సాగే ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటిస్తున్నాడు.