మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద తన డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. మరింతగా వసూళ్ళని పెంచేందుకు చిత్ర యూనిట్ కూడా సాధ్యమైనంత మేరకు ప్రచార కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. 

అల వైకుంఠపురములో చిత్ర సంగీతం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ ఆల్బమ్ ఇదే. తమన్ కెరీర్ లో కూడా బెస్ట్ ఆల్బమ్ ఇదే. మ్యూజిక్ సూపర్ సక్సెస్ కావడంతో త్రివిక్రమ్ కూడా మ్యుజీషియన్స్ కి, లిరిసిస్ట్ లకు పెద్ద పీటవేసారు. 

ఈ చిత్రం మ్యూజిక్ పైనే ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్, తమన్ ఈ చిత్రానికి పనిచేసిన లిరిసిస్ట్ అందరితో ఇంటర్వ్యూ చేశారు. ప్రతి ఒక్క లిరిసిస్ట్ ఈ చిత్రంలో తమ అనుభవాలని పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఓ సందర్భంగా తమన్, త్రివిక్రమ్ మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. 

తమన్ మాట్లాడుతూ.. కొందరు మాట్లాడుతుంటే జోలపాట లాగా ఉంటుంది. నేను వెంటనే నిద్రలోకి జారుకుంటా. కొన్ని సందర్భాల్లో దర్శకులు కథ చెబుతుంటే ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సమయంలో మా అమ్మని సాకుగా చెప్పి తప్పించుకుంటా. మా అమ్మ కథ చెబుతుంటే వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుంది. మీరు మా అమ్మలాగే కథ చెప్పారు సర్ అని ఆ దర్శకులకు చెబుతుంటా అని తమన్ అన్నాడు. 

స్విమ్మింగ్ పూల్ లో వితిక, వరుణ్ రొమాంటిక్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోస్

దీనితో అక్కడున్న అందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి. వెంటనే త్రివిక్రమ్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. 'పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. నేను 'అతడు' కథ చెబుతుండగా నిద్రపోయారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆయన స్టూల్ మీద కూర్చునే నిద్రపోయారు అని త్రివిక్రమ్ సరదా వ్యాఖ్యలు చేశారు. 

అవమానంగా ఫీలైన పవన్ హీరోయిన్.. సోనాక్షి సిన్హాపై షాకింగ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సూపర్ హిట్ చిత్రాల్లో అతడు కూడా ఒకటి. తాను ఆ సమయంలో బాగా అలసిపోయి ఉండడం వల్ల అతడు కథ వినలేదని.. నిద్రపోయానని పవన్ ఇదివరకే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా త్రివిక్రమ్ జల్సా కథతో మళ్ళీ తన వద్దకు వచ్చాడని పవన్ ఓ వేడుకలో తెలిపాడు. అతడు కథపై పవన్ ఆసక్తి చూపక పోవడంతో త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఆ చిత్రాన్ని చేశారు.