2010లో విడుదలైన పవన్ కళ్యాణ్ పులి చిత్రంతో నికీషా పటేల్ హీరోయిన్ గా మారింది. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో నికీషా పటేల్ కు నిరాశ తప్పలేదు. గ్లామర్ ఒలకబోసినప్పటికీ మంచి ఆఫర్స్ రాలేదు. దీనితో నికీషా పటేల్ చిన్న చిత్రాలకు మాత్రమే పరిమితం అయింది. 

తెలుగుతో పాటు తమిళంలో ప్రయత్నించినప్పటికీ నికీషాకు సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం నికీషా కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది. నికీషా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా బికినీలో అందాలు ఆరబోస్తూ, బీచ్ లో విహరిస్తున్న ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా నికీషా పటేల్ తన అభిమానులకు ఓ విషయాన్ని తెలియజేస్తూ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కొందరు నెటిజన్లు నికీషాని పదే పదే సోనాక్షి సిన్హాతో పోల్చడం ప్రారంభించారు. ఇది నికీషా పటేల్ కు నచ్చినట్లు లేదు. 

దీనితో నికీషా పటేల్ ఘాటుగా ఓ ట్వీట్ చేసింది. 'నేను సోనాక్షి సిన్హా లాగా ఉన్నానని ఎవరైనా అంటే అది ప్రశంస కాదు. మీరు ఆమెతో పోల్చితే నేను ఇంకాస్త ఎక్కువ సమయం జిమ్ లో కష్టపడాల్సి ఉంటుంది' అని పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

నికీషా పటేల్ మాటల్లోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. సోనాక్షి సిన్హా బరువు ఎక్కువగా ఉందనే విషయాన్ని నికీషా చెప్పకనే చెప్పింది. బాలీవుడ్ లో ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే సోనాక్షి సిన్హా కాస్త బొద్దుగానే ఉంటుంది. 

స్విమ్మింగ్ పూల్ లో వితిక, వరుణ్ రొమాంటిక్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోస్

నికీషా పటేల్ కామెంట్స్ ని ఆమె అభిమానులు కొందరు సమర్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. నిజమే నీకు మరొకరితో పోలిక వద్దు.. నువ్వు నీలానే ఉండు అని అంటున్నారు. సోనాక్షి అభిమానులు మాత్రం నికీషాని ట్రోల్ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా బొద్దుగా ఉన్నప్పటికీ ఫిట్ గా పర్ఫెక్ట్ లుక్ తో ఉంటుందని అంటున్నారు. నికీషా కామెంట్స్ పై సోనాక్షి స్పందిస్తుందేమో చూడాలి.