స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇటీవల విడుదలైన చిత్రం అల వైకుంఠపురములో. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ నెలకొల్పింది. అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్ర కథపై మొదటి నుంచి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల వైకుంఠపురములో చిత్ర కథ 1958లో విడుదలైన ఎన్టీఆర్, సావిత్రిల ఇంటిగుట్టు చిత్రాన్ని పోలి ఉందంటూ కొందరు కామెంట్స్ చేశారు. సినిమాపై ఎలాంటి కామెంట్స్ వినిపించినా త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, బన్నీ పెర్ఫామెన్స్ నచ్చడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 

చిరంజీవి, సురేఖ పెళ్లి చూపులు అలా జరిగాయి.. మెగాస్టార్ అహం దెబ్బతినిందట!

తాజాగా త్రివిక్రమ్ తన కథని కాపీ చేశారు అంటూ కృష్ణ అనే దర్శకుడు తెరపైకి వచ్చాడు. కొన్నేళ్ల క్రితమే తాను త్రివిక్రమ్ కు అల వైకుంఠపురములో కథ వినిపించానని అంటున్నాడు. త్రివిక్రమ్ తన కథనే అల వైకుంఠపురములో చిత్రంగా తెరకెక్కించారని ఆ దర్శకుడు తాజాగా చేస్తున్న ఆరోపణ. 

సౌత్ దర్శకులు, హీరోల డ్రీమ్స్.. నెరవేరే ఛాన్స్ ఉందా!

త్వరలో తాను త్రివిక్రమ్ కు లీగల్ నోటీసులు కూడా పంపే ఆలోచనలో ఉన్నట్లు త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. తాను ఈ కథని 2013లోనే రిజిస్టర్చేయించానని.. అందుకు సంబందించిన కాపీ కూడా తనవద్ద ఉందని కృష్ణ పేర్కొన్నారు. అప్పట్లో తాను ఈ చిత్రానికి దశ- దిశ అనే టైటిల్ కూడా అనుకున్నట్లు కృష్ణ తెలిపాడు.