సౌత్ దర్శకులు, హీరోల డ్రీమ్స్.. నెరవేరే ఛాన్స్ ఉందా!
సౌత్ లో కొందరు దర్శకులు, హీరోలకు ఆసక్తికరమైన డ్రీమ్స్ ఉన్నాయి. కొందరికి నెరవేరడానికి కష్టసాధ్యమైన డ్రీమ్స్ అయితే.. మరికొందరివి భవిష్యత్తులో నెరవేరే అవకాశం ఉంది.
శంకర్ : జెంటిల్ మాన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో లాంటి చిత్రాలతో దర్శకుడు శంకర్ ఇండియన్ సినిమాకు సక్సెస్ అంటే ఇది అని చూపించారు. సినిమాలు భారీ స్థాయిలో ఉన్నప్పుడే ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతికి లోనవుతారనేది శంకర్ ఆలోచన. దర్శకుడు శంకర్ కోరుకుంటే బడా హీరోలంతా ఆయనతో సినిమా చేసేందుకు రెడీగా ఉంటారు. అలాంటిది శంకర్ కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అందులో ఇకటి పూర్తి స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ చిత్రం చేయడం. దీనిపై మాట్లాడుతూ శంకర్ ఓ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చిత్రాలని తొలి ప్రేమ నుంచి ఫాలో అవుతున్నా.. ఆయనతో మార్షల్ ఆర్ట్స్ సినిమా చేయాలని ఉంది అని శంకర్ అన్నారు. ప్రస్తుతం పవన్ ఉన్న బిజీలో శంకర్ దర్శత్వంలో నటించడం కష్టమే.
మహేష్ బాబు : సూపర్ స్టార్ మహేష్ బాబు పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నంతో కలసి ఓ చిత్రం చేయాలనే కోరికని బయట పెట్టాడు. కానీ ప్రస్తుతం మణిరత్నం ఉన్న ఫామ్, మహేష్ క్రేజ్ దృష్ట్యా వీరిద్దరో కాంబోలో సినిమా కుదరకపోవచ్చు.
యష్ : కెజిఎఫ్ చిత్రంతో యష్ సౌత్ లో సూపర్ హీరోగా మారిపోయాడు. హీరో యష్ ఓ సంధర్భంలో మాట్లాడుతూ.. హీరోలని సూపర్ హీరోలుగా చూపించే శంకర్ అంటే ఇష్టమని, ఆయన దర్శకత్వంలో నటించాలని ఉందని యష్ తెలిపాడు. భవిష్యత్తులో వీరిద్దరో కాంబోలో సినిమా తెరకెక్కడం సాధ్యమే.
ప్రభాస్ : ప్రభాస్ కు, అతడి పెదనాన్న కృష్ణం రాజుకు డ్రీమ్ ప్రాజెక్టు భక్త కన్నప్ప. ఆ చిత్రంలో ప్రభాస్ ని నటింపజేయడానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాజమౌళి : రాజమౌళికి డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అనే సంగతి అందరికి తెలిసిందే. కానీ రాజమౌళి మదిలో మరో ఆలోచన ఉంది. సూపర్ స్టార్ మహేష్ తో జేమ్స్ బాండ్ తరహా చిత్రం చేయాలని. అలాంటి కథ దొరకడం.. ఆ కథతో తెలుగువారిని మెప్పించడం కాస్త కష్టమే కానీ.. రాజమౌళి తలుచుకుంటే జరుగుతుంది.
త్రివిక్రమ్ : త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ లది క్రేజీ కాంబినేషన్. పవన్ తో చేయాలనుకుని ఆగిపోయిన త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అదే కోబలి.
మణిరత్నం : భారీ స్థాయిలో పొన్నియన్ సెల్వం నవలని సినిమాగా రూపందించాలనేది మణిరత్నం కోరిక. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వర్క జరుగుతోంది.
దాసరి నారాయణరావు :మహాభారతంపై ఒక్క సినిమా అయినా చేయాలనేది దాసరి కోరిక. ఆ కోరిక నెరవేరకుండానే ఆయన తుదిశ్వాస విడిచారు.
గుణశేఖర్ : రుద్రమదేవి చిత్రంతో తాను భారీ బడ్జెట్ చిత్రాలని హ్యాండిల్ చేయగలనని గుణశేఖర్ నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన రానా దగ్గుబాటితో హిరణ్యకశ్యప చిత్రం తెరకెక్కించే పనిలో ఉన్నారు.
కృష్ణ వంశీ : చాలా రోజుల క్రితం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాలనుకున్న చిత్రం 'వందేమాతరం'. చిరు కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా ఉన్నారు. కానీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఈ చిత్రం అప్పట్లో సాధ్యం కాలేదని.. ఎలాగైనా ఈ కథని సెట్స్ పైకి తీసుకెళ్లాలని కోరిక ఉందని కృష్ణవంశీ ఓ సంధర్భంలో తెలిపారు.