మాజీ సీఎం నారా చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా నారా రోహిత్ మంచి అంచనాలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. నారా రోహిత్ కెరీర్ లో సోలో, ప్రతినిధి లాంటి చెప్పుకోదగ్గ చిత్రాలు ఉన్నాయి. కానీ ఇటీవల నారా రోహిత్ కు సరైన సక్సెస్ లేదు. 

అదే సమయంలో నారా రోహిత్ ఫిట్ నెస్ కోల్పోతూ బొద్దుగా కనిపిస్తున్నాడనే విమర్శలు కూడా సినీ విశ్లేషకుల నుంచి వినిపించాయి. హీరోకి ఉండాల్సిన ఫిట్ నెస్ నారా రోహిత్ కోల్పోతున్నాడంటూ కామెంట్స్వినిపించాయి. 

ఆ కామెంట్స్ ని నారా రోహిత్ సీరియస్ గా తీసుకున్నాడో ఏమోకానీ.. తన లుక్ మార్చుకునేందుకు బాగానే కష్టపడ్డాడు. తాజాగా నారా రోహిత్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయి అందరికి షాక్ ఇచ్చాడు. 

ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తులనే వివాహం చేసుకున్న హీరోయిన్లు

గుర్తు పట్టలేని విధమా అంటే నెగిటివ్ గా కాదు.. మునుపటి కంటే స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. నారా రోహిత్ ని ఇంత స్టైలిష్ లుక్ లో గతంలో ఎన్నడూ చూడలేదంటే అతిశయోక్తి కాదు. 

హ్యాట్, గాగుల్స్ ధరించిన నారా రోహిత్ క్లీన్ షేవ్ లుక్ లో బాలీవుడ్ హీరోలని తలపిస్తున్నాడు. నారా రోహిత్ లుక్ విమర్శకుల నోళ్లు మూయించే విధంగా ఉంది. ఇక నారా రోహిత్ చేయాల్సిందల్లా మంచి కథ ఎంచుకుని వెండితెరపైకి వచ్చేయడమే..  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#staysafe

A post shared by Rohith Nara (@rohithnara) on May 16, 2020 at 6:11am PDT