సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం శనివారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్లుగానే మహేష్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

యాక్షన్, ఎమోషనల్, కామెడీ అన్ని విభాగాల్లో ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. అంచనాలకు మించి సరిలేరు నీకెవ్వరు చిత్ర వసూళ్లు నమోదవుతున్నాయి. తొలి రోజు ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్లకు పైగా షేర్ రాబట్టుకుంది. 

మహేష్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ఓపెనింగ్. ఇక టాలీవుడ్ చరిత్రలో తొలి రోజు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన నాల్గవ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు చిత్రం సాధించిన  షేర్ 46 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. యుఎస్ లో ఇప్పటికే సరిలేరు వసూళ్లు 1 మిలియన్ దాటేశాయి. 

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా సరిలేరు నీకెవ్వరు చిత్ర వసూళ్లు ఇలా ఉన్నాయి.. 

ఏరియా                                  కలెక్షన్స్(షేర్స్)

నైజాం                                     8.66 కోట్లు 

ఉత్తరాంధ్ర                              4. 10 కోట్లు 

సీడెడ్                                      3.70 కోట్లు 

గుంటూరు                               5.15 కోట్లు 

కృష్ణా                                        3.07 కొలు   

ఈస్ట్                                        3. 35 కోట్లు 

వెస్ట్                                         2.72 కోట్లు 

నెల్లూరు                                   1.27 కోట్లు  

మొత్తం(ఏపీ, తెలంగాణ)          32. 02 కోట్లు 

తొలి రోజు సరిలేరు నీకెవ్వరు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడంతో తొలి రోజే ఈ చిత్రం 40 శాతానికిపైగా రికవరీ సాధించినట్లు అయింది. సినిమాకు పాజిటివ్ టాక్ కొనసాగుతుండడం, సంక్రాంతి సెలవులు ఉండడంతో బాక్సాఫీస్  వద్ద మహేష్ బాబు విధ్వంసం కొనసాగనుంది.