ప్రముఖ నిర్మాత ఆలపాటి రంగారావు కన్నుమూశారు.  

ప్రముఖ నిర్మాత ఆలపాటి రంగారావు కన్నుమూశారు. శ్రీనాథ్ మూవీస్,శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అలానే కమల్ కాన్‌ప్రో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయిన ఆలపాటి రంగారావు.. బుధవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఆయన స్వగ్రహంలో కన్నుమూశారు.

ఆలపాటి రంగారావు నిర్మాతగా.. 'ప్రతీకారము', 'కాయ్ రాజా కాయ్', 'రాజ్ కుమార్', 'న్యాయనికి శిక్ష', 'చిన్నారి స్నేహం', 'మా తెలుగుతల్లి', 'నాకు పెళ్లాం కావాలి' వంటి చిత్రాలను రూపొందించారు. 

రోజా గెలుపునకు కారణం చెప్పిన నాగబాబు.. సుధీర్, ఆదిని తీసేద్దాం అనుకుంటే..

ప్రస్తుతం ఈయన వయసు 88 ఏళ్లు. ఈయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంగారావు మరణించారని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.