టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా అతడికి ఫాలోయింగ్ పెరిగిపోతోంది. 'అర్జున్ రెడ్డి' సినిమాతో అటు మాస్ ఆడియన్స్ ని, 'గీత గోవిందం'తో క్లాస్ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకున్నాడు.

అభిమానులంతా ముద్దుగా రౌడీ అని పిలుచుకునే ఈ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా విజయ్ ఓ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యాడు. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆయన స్టేజ్ వద్దకు రాగానే అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు.

''టాలెంట్ లేకుండా ఎంతమందితో పడుకుంటే ఏంటి..?''

అభిమానులు చేసిన హడావిడికి అక్కడే ఉన్న రష్మిక సైతం షాక్ కి గురైంది. ఈ ఈవెంట్ లో ఓ విలేకరి కోలీవుడ్ లో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ధనుష్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూశానని.. సూర్య, కార్తిలతో నటించడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు.

రజినీకాంత్, అజిత్, విజయ్ లాంటి పెద్ద స్టార్స్ సినిమాల్లో తనకు నటించడానికి చిన్న పాత్ర మాత్రం ఉంటుందని.. అలా నటించడం తనకు ఇష్టం ఉండదని తెలిపాడు. అంతేకాకుండా లిప్ లాక్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. నిజానికి తనకు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని.. కానీ ఒక నటుడిగా అలాంటి సన్నివేశాల్లో నటించక తప్పదని.. అది తన వృత్తి అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అలానే ఈ హీరో పూరి జగన్నాథ్ తో ఓ సినిమా, దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమా అంగీకరించాడు.