టాలీవుడ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా మా అసోసియేషన్ లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. మా ప్రెసిడెంట్ నరేష్ వర్గానికి, హీరో రాజశేఖర్ వర్గానికి పడడం లేదు. పరస్పరం వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

జనవరిలో జరిగిన మా డైరీ లాంచ్ కార్యక్రమంలో కూడా రసాభాస జరిగింది. నరేష్ విధానాన్ని తప్పుబడుతూ హీరో రాజశేఖర్ బహిరంగంగా విమర్శలకు దిగారు. ఆ సమయంలో వేదికపై చిరంజీవి సహా మోహన్ బాబు, కృష్ణం రాజు లాంటి ప్రముఖంతా ఉన్నారు. ఆ సమయంలో చిరు కలుగజేసుకుని బహిరంగ విమర్శలు వద్దని.. ఏదైనా ఉంటె చెవిలో మాట్లాడుకోవాలని రాజశేఖర్ ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. 

ఇక కొంతకాలంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం చిరంజీవి ముందుకు వస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిత్ర పరిశ్రమలోని సమస్యల గురించి మంత్రి తలసానితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 

జూ.ఎన్టీఆర్ అంటే అందుకే ఇష్టం.. ఆ సినిమా 50 సార్లు చూశా

తాజాగా చిరంజీవి నివాసంలో మా క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో చిరంజీవితో కలసి జయసుధ, మురళి మోహన్ లాంటి ప్రముఖులంతా పాల్గొన్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు క్రమశిక్షణ కమిటీ మా అధ్యక్షుడు నరేష్ పై చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అతడిపై వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.