ఇటీవల విడుదలైన హిట్ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. శైలేష్ కొలను దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మాత. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ఇది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. 

యంగ్ బ్యూటీ రుహాని శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. రిలీజ్ తర్వాత కూడా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఓ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు శైలేష్, హీరోయిన్ రుహాని శర్మ పాల్గొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ఎవరితో కలసి వర్క్ చేయాలనేది మీ డ్రీమ్ అని ప్రశ్నించగా.. శైలేష్.. జూ. ఎన్టీఆర్ పేరు చెప్పాడు. 

ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంటెన్స్ పెర్ఫార్మర్. అరవింద సమేత చిత్రం చూశా. అందులో ఫోన్ లోనే విలన్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ నిజంగా క్రేజీ. అలాంటి సన్నివేశాల్లో ఎన్టీఆర్ మాత్రమే నటించగలరు అని శైలేష్ అన్నారు. 

వీపులు గోకేది వాళ్లే.. చిరంజీవి ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం.. నటి షాకింగ్ కామెంట్స్!

ఇక కమల్ హాసన్ కూడా తన అభిమాన నటుడని శైలేష్ అన్నారు. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'హే రామ్' చిత్రం వల్లే తనకు దర్శకుడిని కావాలనే కోరిక పుట్టిందని శైలేష్ అన్నారు. ఆ చిత్రాన్ని 50 సార్లు చూసి ఉంటా. అందులో కమల్ నటనతో పాటు.. దర్శకత్వ ప్రతిభ కూడా అద్భుతం అని శైలేష్ అన్నారు.