గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంతకిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. 

అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.'దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

'ఇండియా మొత్తం వినిపించాలి'.. టాలీవుడ్ హీరోల పోస్ట్ లు!

ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు, మహిళా నేతలు, రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సినీ నటులు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. టాలీవుడ్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, శ్రీముఖిలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు.

అనసూయ తనకు ఎంతో సంతోషంగా ఉందని, చాలా గర్వంగా కూడా ఉందని ట్వీట్ లు పెట్టగా.. యాంకర్ శ్రీముఖి తెలంగాణా పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పింది. న్యాయం  జరిగిందని రాసుకొచ్చింది.