Asianet News TeluguAsianet News Telugu

వైభవంగా నటి అర్చన సంగీత్.. వీడియో వైరల్

నటి అర్చన పెళ్ళికి సిద్దమైన విషయం తెలిసిందే. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్న అర్చన పెళ్లి వేడుకలు ఇటీవల మొదలయ్యాయి.  హైదరాబాద్ హెల్త్ కేర్ వైజ్ ప్రేజిడెంట్ జగదీష్ తో అర్చన గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇక ఫైనల్ గా ఇరు కుటుంబాల నిర్ణయంతో ఈ యువ జంట పెళ్లికి సిద్ధమైంది.

tollywood actress archana sangith function
Author
Hyderabad, First Published Nov 12, 2019, 11:38 AM IST

తెలుగు సీనియర్ నటి అర్చన పెళ్ళికి సిద్దమైన విషయం తెలిసిందే. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్న అర్చన పెళ్లి వేడుకలు ఇటీవల మొదలయ్యాయి.  హైదరాబాద్ హెల్త్ కేర్ వైజ్ ప్రేజిడెంట్ జగదీష్ తో అర్చన గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇక ఫైనల్ గా ఇరు కుటుంబాల నిర్ణయంతో ఈ యువ జంట పెళ్లికి సిద్ధమైంది.

ఇక రీసెంట్ వీరి సంగీత్ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో అర్చన కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. సంగీత్ లో బిగ్ బాస్ 1 విన్నర్ శివబాలాజీ కూడా పాల్హోన్నాడు. వధువరుడు ఇద్దరు కూడా సంగీత్ వేడుకలో స్టెప్పులేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.  ఇక ఈ జంట వివాహ వేడుకకు తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నారు.  కొన్ని రోజుల క్రితం ప్రియుడితో అర్చన నిశ్చితార్థం వైభవంగా జరిగింది.

tollywood actress archana sangith function

సోషల్ మీడియాలో కూడా అర్చన తన ప్రియుడి ఫొటోల్ని షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితమే అర్చన ప్రియుడితో కలసి ఉన్న ఫోటో షేర్ చేసి త్వరలోనే మీ అందరికి గుడ్ న్యూస్ చెబుతా అంటూ అభిమానులకు తెలియజేసింది. దీనితో అర్చన త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని అభిమానులు ఊహించారు.ఫైనల్ గా నవంబర్ 13న హైదరాబాద్ లో వైభవంగా మూడుముళ్ల బంధంతో ఈ జంట మరింత దగ్గరకానుంది.

also read: ప్రియుడితో పెళ్లికి సిద్దమైన తెలుగు హీరోయిన్.. డేట్ ఫిక్స్

వేడుకకు పలువురు సినీ సెలబ్రెటీలు అలాగే రాజాకీయ నాయకులు వ్యాపారవేత్తలు ముఖ్య అతిధులుగా పాల్గొనబోతున్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్ లో మెరిసిన అర్చన ఆ తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మరి పెళ్లి అనంతరం అర్చన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios