హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన తెలుగమ్మాయి అర్చన పెళ్ళికి సిద్దమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ హెల్త్ కేర్ వైజ్ ప్రేజిడెంట్ జగదీష్ తో అర్చన గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇక ఫైనల్ గా ఇరు కుటుంబాల నిర్ణయంతో ఈ యువ జంట పెళ్లికి సిద్ధమైంది.  ఇక వివాహ వేడుకకు తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నారు.

గత కొన్ని రోజుల క్రితం ప్రియుడితో అర్చన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. సోషల్ మీడియాలో కూడా అర్చన తన ప్రియుడి ఫొటోల్ని షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితమే అర్చన ప్రియుడితో కలసి ఉన్న ఫోటో షేర్ చేసి త్వరలోనే మీ అందరికి గుడ్ న్యూస్ చెబుతా అంటూ అభిమానులకు తెలియజేసింది. దీనితో అర్చన త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని అభిమానులు ఊహించారు.

ఫైనల్ గా నవంబర్ 13న హైదరాబాద్ లో వైభవంగా మూడుముళ్ల బంధంతో ఈ జంట మరింత దగ్గరకానుంది. వేడుకకు పలువురు సినీ సెలబ్రెటీలు అలాగే రాజాకీయ నాయకులు వ్యాపారవేత్తలు ముఖ్య అతిధులుగా పాల్గొనబోతున్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్ లో మెరిసిన అర్చన ఆ తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మరి పెళ్లి అనంతరం అర్చన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేస్తుందో చూడాలి.