గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంతకిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. 

అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని,  వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

justice for disha : 'ఇదొక ఉదాహరణ' అక్కినేని హీరోల కామెంట్స్!

ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు, మహిళా నేతలు, రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు. 

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. ''తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమిది.. సజ్జనార్ సర్ కి హ్యాట్సాఫ్.. దిశకి పెర్ఫెక్ట్ న్యాయం జరిగింది.. ప్రతివారిలో ఈ భయం మొదలవ్వాలి.. ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూసినా, అసభ్యంగా ప్రవర్తించినా.. వారికి టెర్రర్ రావాలి.. ఆడవాళ్లు సర్, అమ్మలు సర్.. మనల్ని తొమ్మిది నెలలు కడుపులో భద్రంగా కాపాడి, పెంచిన దానికి కృతజ్ఞతగా చుట్టూ ఉన్న ఆడవాళ్లను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుందాం.. పోలీసులే రావక్కర్లేదు.. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే ప్రశ్నించడం మనం కూడా నేర్చుకుందాం.. పోలీసులు చాలా తక్కువ మంది ఉన్నారు.. సమాజం కూడా ఒక్కో పోలీసై ప్రశ్నించడం నేర్చుకోవాలి. అమ్మాయిలను జాగ్రత్తగా పెంచాలి అనేది ఒకటైతే.. కొడుకులను పద్దతిగా పెంచడం నేర్చుకోండి. ఆడంబరాలకు, అవసరాలకు తేడా చెప్పండి'' అంటూ చెప్పుకొచ్చారు