టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు బోల్తా పడినట్లు తెలుస్తోంది.  విజయవాడ నుంచి హైదరాబాద్ కి వస్తుండగా పెద్ద గోల్కొండ వద్ద ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. హీరో రాజశేఖర్ తో పాటు మరొక వ్యక్తికి గాయాలయ్యాయి.

అదృష్టవశాత్తు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. గతంలోనే రాజశేఖర్ ఒకసారి కారు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక నేడు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై మరోసారి ఆయన కారు ప్రమాదానికి గురయ్యింది. మంగళవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. రాజశేఖర్ తో పాటు మరొక వ్యక్తి సురక్షితగానే బయటపడ్డట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన అనంతరం రాజశేఖర్ తన సన్నిహితులకు సమాచారం ఇవ్వడంతో వారు మరో కారులో రాజశేఖర్ ని ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

also read: వివాదంలో రాజశేఖర్ న్యూ ప్రాజెక్ట్.. మరో హీరోను సెట్ చేసుకున్న నిర్మాత!

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల ఒక సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  స్క్రిప్ట్ విషయంలో దర్శకుడికి హీరోకు అభిప్రాయం బేధాలు రావడంతో సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే ఆగిపోయింది.దీంతో ఆ చిత్ర నిర్మాత మరొక హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరగా రాజశేఖర్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రాజశేఖర్ కథల వేటలో పడ్డారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి దర్శకుడితో స్టోరీ డిస్కర్షన్స్ చేస్తున్నారట. కథ ఏ మాత్రం నచ్చిన సినిమాని సెట్స్ పైకి తేవాలని మంచి స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వీరభద్రమ్ చెప్పిన ఒక థ్రిల్లర్ కథ ఈ సినీయార్ హీరోకి బాగా నచ్చేసిందట. దీంతో వెంటనే ఏడు చేపల కథ నిర్మాత శేఖర్ రెడ్డి ప్రొడక్షన్ హౌజ్ లో త కొత్త సినిమాను నిర్మించేందుకు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.  ఏడు చేపల కథ టీజర్ - ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఆ ప్రొడక్షన్ టీమ్ తో రాజశేఖర్ తన కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక గరుడవేగ లాంటి సక్సెస్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఈ హీరో ట్రై చేస్తున్నాడు. ఇకపోతే దర్శకుడు వీరభద్రమ్ కెరీర్ మొదట్లో అల్లరి నరేష్ తో ఆహా నా పెళ్లంట - సునీల్ తో పూల రంగడు వంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు.

అనంతరం నాగ్ తో చేసిన భాయ్ బెడిసికొట్టింది. అలాగే చుట్టాలబ్బాయి సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా మంచి సక్సెస్ ని అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మరి ఈ ప్రాజెక్ట్ తో ఇద్దరు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.