చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో పాజిటివ్ సక్సెస్ అందుకున్న సీనియర్ యాక్టర్ రాజశేఖర్ ఊహించని విధంగా మళ్ళీ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ప్లాప్ ట్రాక్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేసిన డిఫరెంట్ మూవీ కల్కి ఊహించని విధంగా బెడిసి కొట్టింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నప్పటికీ మెల్లగా కలెక్షన్స్ తగ్గడంతో ప్లాప్ అని తేలిపోయింది.

అయితే నెక్స్ట్ మరో మంచి సినిమాతో హిట్టు కొట్టాలని రాజశేఖర్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్న తరుణంలో పలు వివాదాల వల్ల సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ ను తప్పించి చిత్ర యూనిట్ సభ్యులు మరో హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల రాజశేఖర్ ఒక కన్నడ సినిమాను రీమేక్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తమిళ్ ప్రొడ్యూసర్ ధనంజయ ఈ రీమేక్ ను తమిళ్ తెలుగులో ఒకేసారి నిర్మించనున్నట్లు తెలియజేశారు. తమిళ్ వెర్షన్ లో సత్యరాజ్ తనయుడు సీబీ సత్యరాజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా తెలుగులో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిననున్నట్లు ఎనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్లు తెలుస్తోంది. అనుకోని కారణాల వల్ల రాజశేఖర్ ని తప్పించి సుమంత్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.