హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ నెల 27న ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన ప్రియాంక తిరిగి ఇంటికి రాలేదు. మధ్యలో తన సోదరికి ఫోన్ చేసి స్కూటీ పంక్చర్ అయ్యిందని తనకు భయంగా ఉందని చెప్పిన కొద్ది సేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. 

బుధవారం నాడు మిస్ అయిన ప్రియాంకారెడ్డి గురువారం తెల్లవారు జామున షాద్ నగర్ సమీపంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రియాంక రెడ్డిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అతిదారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగా మారింది.

ప్రియాంక హత్య: ఈ జంతువులని ఇలా చేయండి.. చట్టానికి వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూచన! 

ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ప్రియాంకా హత్యపై స్పందిస్తున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈ సంఘటన గురించి మాట్లాడారు.

తాజాగా టాలీవుడ్ కమెడియన్ అలీ.. ప్రియాంక హత్యపై స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని, ప్రియాంక తల్లితండ్రులకు న్యాయం చేయాలని కోరారు. ఆ తల్లి తండ్రులని చూస్తూనే గుండె తరుక్కుపోతుందని చెప్పారు.

నిన్నటివరకు కళ్లముందు తిరిగిన అమ్మాయి ఇక లేదంటే.. ఆ తల్లితండ్రుల ఆవేదన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని.. వారు నిందితులను షూట్ చేయొద్దు, ఉరి తీయొద్దని అంటున్నారని.. తమ కూతురికి జరిగినట్లుగానే వారికి కూడా జరగాలని ఆ తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారని.. వారికి పోలీసులు సహకరించాలని కోరారు. నిందితుల తరఫున ఏ న్యాయవాది వాదించకూడదని.. బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం హర్చనీయమని అన్నారు.