మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా ప్రేమకథా చిత్రాలు కూడా తెరకెక్కించారు. నువ్వే నువ్వే అనే ప్రేమ కథా చిత్రంతో త్రివిక్రమ్ దర్శకత్వ ప్రయాణం ప్రారంభమైంది. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరు. 

త్రివిక్రమ్ రియల్ లైఫ్ లో కూడా చిన్న సైజు లవ్ స్టోరీ జరిగింది. గతంలో త్రివిక్రమ్ సన్నిహితులు పలు ఇంటర్వ్యూలలో తెలిపిన వివరాల ప్రకారం ఈ మాటలమాంత్రికుడి మ్యారేజ్ సినిమాటిక్ తరహాలో జరిగినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సతీమణి సౌజన్య. వీరిద్దరి వివాహం 2002లో జరిగింది. 

కానీ త్రివిక్రమ్ మొదట వాళ్ళ ఇంటికి తన సతీమణి అక్కని చూద్దామని వెళ్లారట. కానీ త్రివిక్రమ్ కు సౌజన్య నచ్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడి కుమార్తె సౌజన్య. త్రివిక్రమ్ ధైర్యం చేసి సౌజన్య తనకు నచ్చిందని చెప్పేశారట. అప్పటికే సిరివెన్నెల త్రివిక్రమ్ తెలిసిన అబ్బాయి, ఏ చేదుఅలావాట్లు లేవు.. దీనితో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే వివాహానికి అంగీకరించారు. 

బాలీవుడ్ హీరోయిన్ రిజెక్ట్.. బోల్డ్ రోల్ కు రమ్యకృష్ణ రెడీనా!

త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డాన్సర్. పలు వేదికలపై ఆమె డాన్స్ షోలు చేశారు. మొదట చిత్ర పరిశ్రమలో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా దూసుకుపోతున్నారు.