యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది వరుస చిత్రాలతో బిజీగా మారిపోతున్నాడు. ఇప్పటికే నితిన్ వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నటించేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ రీమేక్ లో నితిన్ నటించాల్సి ఉంది. 

ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు రీమేక్ లో టబు పాత్ర నితిన్ కు పెద్ద సమస్యగా మారినట్లుంది. టబు అంధధూన్ చిత్రంలో బోల్డ్ గా అద్భుతంగా నటించింది. తెలుగు రీమేక్ కు కూడా ఆమెని సంప్రదించగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. 

ఇలియానా షాకింగ్ డెసిషన్.. వైరల్ అవుతున్న రూమర్

రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాక టబు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో నితిన్ సౌత్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోరమ్యకృష్ణ కాస్త బోల్డ్ గా నటించాల్సి ఉంటుంది. అందుకు రమ్యకృష్ణ అంగీకరిస్తుందా లేదా అనేది త్వరలో తెలియనుంది. 

2018లో విడుదలైన అంధధూన్ చిత్రం జాతీయ అవార్డులు కూడా కొల్లగొట్టింది.