పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఖరారైనప్పటి నుంచి రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. ఆ రూమర్స్ లో కొన్ని నిజం అవుతున్నాయి. మరికొన్ని రుమార్లుగానే మిగిలిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ మేలో విడుదలకు రెడీ అవుతోంది. మరోవైపు పవన్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న విరూపాక్ష(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. 

ఈ రెండు చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ దర్శత్వంలో నటించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ తర్వాత పవన్ జాబితాలో పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. 

ఈలోపు మరో రూమర్ పుట్టుకొచ్చేసింది.అది అలాంటి ఇలాంటి రూమర్ కాదు.. క్లాసిక్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఎన్ని మాస్ చిత్రాల్లో నటించినప్పటికీ 1998లో  విడుదలైన తొలిప్రేమ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 

ఆ ముగ్గురికి షాక్.. భారీ చిత్రాలని రిజెక్ట్ చేసిన అనుష్క!

కరుణాకరన్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమకథలో ఎవర్గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం అది. ఆ తర్వాత కరుణాకరన్ దర్శత్వంలో పవన్ మరోసారి బాలు చిత్రంలో నటించారు. ఆ మూవీ ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఇన్నేళ్లకు వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. 

ఇటీవల కరుణాకరన్ పవన్ కళ్యాణ్ ని కలసి తొలిప్రేమ సీక్వెల్ కు కథ వినిపించినట్లు, పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తి స్టోరీ డెవలప్ చేయమన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ ఈ వార్త మాత్రం పవన్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.