సౌత్ క్రేజీ హీరోయిన్ అనుష్క బాహుబలి తర్వాత నెమ్మదిగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 చిత్రం 2017లో విడుదలయింది. ఆ తర్వాత అనుష్క కేవలం భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది. ఈ ఏడాది అనుష్క నిశ్శబ్దం చిత్రంతో అభిమానులని పలకరించబోతోంది. 

ఇదిలా ఉండగా అనుష్క తన కెరీర్ లో మూడు క్రేజీ చిత్రాలని వదిలేసుకున్నట్లు తెలిసింది. అనుష్క ఏకంగా రజనీకాంత్ సినిమానే రిజెక్ట్ చేసిందట. అనుష్క రిజెక్ట్ చేసిన ఆ చిత్రం కొచ్చాడియాన్. కొచ్చాడియాన్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రజనీకాంత్ తో యానిమేషన్ మూవీ తెరక్కించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ చిత్రంలో అనుష్క నటించకపోవడమే మంచిదైంది. 

మెగాస్టార్ ని కలసిన భీష్మ డైరెక్టర్.. చిరుని ముట్టుకుని జోకులు!

ఇక అనుష్క దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరక్కించబోతున్న పొన్నియన్ సెల్వం, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప చిత్రాలని కూడా రిజెక్ట్ చేసినట్లు టాక్. నారప్ప చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన అసురన్ మూవీకి రీమేక్. ఈ చిత్రం కోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొదట అనుష్కని సంప్రందించారట. కానీ అనుష్క ఈ చిత్రాన్ని అంగీకరించకపోవడంతో ప్రియమణిని ఎంపిక చేసుకున్నారు.  

ఇటీవల కొంతకాలంగా అనుష్క సెలెక్టివ్ గా మాత్రమే కథలు ఎంపిక చేసుకుంటోంది. తాజా సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం కోసం కొరటాల అనుష్కని సంప్రదించారట. ఈ చిత్రం నుంచి త్రిష తప్పుకోవడంతో కాజల్ ని సంప్రదించారు.. కానీ కాజల్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో అనుష్క వద్దకు ఈ ప్రాజెక్టు వెళ్ళింది. దీనికైనా అనుష్క ఓకే చెబుతుందో లేదో చూడాలి.