Asianet News TeluguAsianet News Telugu

‘మత్తు వదలరా’ టాక్ ఏంటి.. మ్యాజిక్ చేస్తుందా..?

ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకునే దాన్ని బట్టి ఈ సినిమా క్రైమ్ ..థ్రిల్లర్స్ చూసే వర్గానికి బాగా నచ్చుతుంది. అన్ని వర్గాలకు చేరటం కష్టమే. అయితే తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ కాకపోయినా బాధ ఉండదు. 

This week release Mathu Vadalara tollywood Talk
Author
Hyderabad, First Published Dec 23, 2019, 2:30 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. నియో నాయర్ ఫిల్మ్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ విడుదల అయిన నాటి నుంచీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఈ ట్రైల‌ర్ ని చూసి విజ‌య్ దేవ‌ర‌కొండ, అక్కినేని అఖిల్‌, రానా ద‌గ్గుబాటి, ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి వంటివారు సోష‌ల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని స‌పోర్ట్ చేస్తూ ట్వీట్‌లు చేసి సినిమాపై హైప్ ని క్రియేట్ చేశారు. ఈ నేపధ్యంలో చిత్రం ఫిల్మ్ నగర్ టాక్ బయిటకు వచ్చింది.

ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకునే దాన్ని బట్టి ఈ సినిమా క్రైమ్ ..థ్రిల్లర్స్ చూసే వర్గానికి బాగా నచ్చుతుంది. అన్ని వర్గాలకు చేరటం కష్టమే. అయితే తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ కాకపోయినా బాధ ఉండదు. ఎవరికి రీచ్ అవ్వాలో..ఎవరిని టార్గెట్ చేసారో వాళ్లకు నచ్చితే చాలు. కాబట్టి ఆ విషయంలో సినిమా పాసై పోయినట్లే. ఇక ఇన్నాళ్లూ కామెడీ పాత్రల్లో కనపడ్డ...వెన్నెల కిషోర్‌, స‌త్య  సీరియ‌స్ పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. వాళ్లు హీరోతో సమానంగా ఫుల్ లెంగ్త్ లో నడుస్తారు. ఇక ఇలాంటి థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ప్లస్ కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోరే అంత గొప్పగా లేదని, మిగతా దంతా బాగుందని, కొత్త దర్శకుడు అయినా ఎక్కడా తడబాటు లేదని అంటున్నారు.

'ప్రతిరోజూ పండగే' మూడు రోజుల కలెక్షన్స్ !

ఇక హీరోగా పరిచయం అవుతున్న కీరవాణి కొడుకుకు..కమర్షియల్ సినిమాలు ఆఫర్స్ సంగతేమో కానీ బిజీ అయ్యే అవకాసం ఉందంటున్నారు. బి,సి సెంటర్లలలో పెద్దగా ఈ సినిమా ప్రభావం చూపించకపోవచ్చని, మల్టిఫ్లెక్స్ లలో వర్కవుట్ అవ్వచ్చని అంటున్నారు. అలాగే ఓవ‌ర్సీస్‌లో సరైన ప్ర‌మోష‌న్ లేక‌పోవ‌డ‌ంతో ఎంత వరకూ అక్కడ కష్టమే అంటున్నారు.  రాజ‌మౌళి ప్రీ రిలీజ్ కు వచ్చి మాట్లాడటంతో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో  ఓపినింగ్స్ కొంతవరకూ ఉపయోగపడచ్చు.  అయితే ఇవన్నీ కాకి లెక్కలు లాంటివే. అసలు టాక్ ఏంటనేది రిలీజ్ అయితేనే చెప్పలేం.

 రాజమౌళి మాట్లాడుతూ– ‘‘రితేష్‌ ఐడియా నాకు బాగా నచ్చింది. సింహా, కాలభైరవకు చక్కటి భవిష్యత్తు ఉంది. నా ‘యమదొంగ’ చిత్రానికి నిర్మాత చెర్రీనే. నా కెరీర్‌లో అతి తక్కువ సమయంలో తీసిన చిత్రం ‘యమదొంగ’.. దానికి కారణ చెర్రీ ప్లానింగే’’ అన్నారు.

 కీరవాణి మాట్లాడుతూ మా పిల్లల్ని నేను ఎప్పుడూ తిడుతూ ఎంకరైజ్ చేస్తుంటాను. ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతుంటాను.కానీ ఇప్పుడు నా తనయులను చూస్తుంటే గర్వంగా వుంది. ఓ అబ్బాయి సంగీతం చేశాడనో, మరో అబ్బాయి నటించాడనో పుత్రోత్సహం, గర్వం కలగలేదు. బాహుబలిలో దేవసేన పరిచయ సన్నివేశానికి కాలభైరవ సంగీతం అందించాడు. హంసనావ పాటలో రెండు లైన్లు పాడాడు. ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు. ఇది నేనే చేశాను అని ఎప్పుడూ చెప్పలేదు. ఆ లక్షణం నాకు నచ్చింది.

 ఒకసారి మా ఫ్యామిలీ ఫంక్షన్‌లో సరదాగా ఓ క్వీజ్ కార్యక్రమం ఆడినప్పుడు కొడుకు మీద ప్రేమతో శ్రీ సింహాకు సమాధానం ముందే చెప్పాను. అయితే శ్రీసింహా మాత్రం తనకు ఆన్సర్ తెలిసినా జవాబు తప్పు చెప్పి క్రీడాస్ఫూర్తి చాటుకున్నాడు. ఆ సమయంలో తనలో నటుడు కనిపించాడు. ప్రతి ఆర్టిస్ట్‌లోనూ ఓ మంచి లక్షణం వుంటుంది. దాన్ని పట్టుకుని సాధన చేసుకోవాలని సింహాకు సలహా ఇస్తున్నాను. రితేష్ చిత్రాన్ని చక్కగా రూపొందించాడు. ఈ సినిమా అందరికి మంచి పేరు తీసుకరావాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios