తమిళ నటుడు అరవింద్ స్వామికి మహిళల్లో ఎంతటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. 90వ దశకంలో రోజా, బొంబాయి లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ స్వామి క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తున్నాడు. తనిఒరువన్ చిత్రంలో అరవింద్ స్వామి నటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

స్టైలిష్ గా కనిపిస్తూనే నెగిటివ్ షేడ్స్ తో అదరగొట్టారు. ఆ చిత్రం విజయం సాధించడంలో అరవింద్ స్వామి పాత్ర కూడా ఓ కారణం. అదే చిత్రం తెలుగు ధృవ పేరుతో రీమేక్ అయితే అందులో కూడా అరవింద్ స్వామే విలన్ గా నటించాడు. ఈ ఏడాది అరవింద్ స్వామి మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలకు రెడీ అవుతున్నారు. 

తాజా సమాచారం మేరకు అరవింద్ స్వామి రొమాంటిక్ హీరో శింబు చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో శింబు వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మానాడు' అనే పొలిటికల్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రంలో ముందుగా కన్నడ హీరో సుదీప్ ని విలన్ గా తీసుకోవాలని భావించారు. 

ఈ సంక్రాంతికి మేమైతే పాస్.. వారిద్దరూ ఉతికారేశారు!

కానీ తాజాగా అరవింద్ స్వామిని విలన్ రోల్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ గా సాగే ఈ పొలిటికల్ డ్రామాలో అరవింద్ స్వామి నటిస్తే బావుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. 2018లో మణిరత్నం దర్శత్వంలో తెరకెక్కిన నవాబ్ చిత్రంలో వీరిద్దరూ సోదరులుగా నటించారు. ఈ మూవీలో శత్రువులుగా మారడం ఆసక్తిగా ఉంది. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది.