విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు.. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి  సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసి ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో వారం క్రితం ‘తిప్పరా మీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో శ్రీవిష్ణు నెగటివ్‌ షెడ్స్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. ఓపినింగ్స్ బాగానే వచ్చాయి. అయితే సినిమా మాత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ అయ్యింది.  దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లు గోలెత్తిపోతున్నట్లు వినికిడి.

Jabardasth: నాగబాబు అవుట్.. బండ్ల గణేష్ ఇన్..?

ఈ చిత్రాన్ని అంతకు ముందు శ్రీవిష్ణు నటించిన బ్రోచేవారెవరురా మంచి హిట్ కావటంతో మంచి రేట్లు కు అమ్మారు. ఈ సినిమా ఎనభై శాతం పైగా ఇన్విస్టిమెంట్ లాస్ అవుతన్నట్లు తెలుస్తోంది. మినిమం రెవిన్యూలు కూడా జెనరేట్ అవటం లేదంటున్నారు. దాంతో ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారనేది చర్చగా మారింది.

నిర్మాతని బయ్యర్లు కలిసి రికవరీ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. శ్రీ విష్ణుని ఈ విషయమై అడగబోతన్నారట. అదే కనక జరిగితే శ్రీవిష్ణు కెరీర్ కు పెద్ద దెబ్బే. తల్లి సెంటిమెంట్ తో సాగే ఈ సినిమా లో ఎపిసోడ్స్ గా కొన్ని బాగున్నా... టోటల్ గా చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది.

మెయిన్ సీన్స్ కూడా బోర్ కొట్టడం విసిగించింది. దానికి తోడు ఫస్టాఫ్ లో ల్యాగ్ ఎక్కువై మరీ ఇబ్బందిగా అనిపించింది.  హీరో ఎమోషన్ జర్నీని బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. కాంప్లిక్ట్ లేకపోవటంతో కలిసిరాలేదు.  ‘తిప్పరామీసం’ అనే టైటిల్ కు ఉన్నంత  పవర్  సినిమాలో అస్సలు క‌నిపించ‌దు.