బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది 'జబర్దస్త్'. ఈ షోకి పోటీగా ఎంతమంది ఎన్ని షోలు మొదలుపెట్టినా.. దీని ముందు నిలబడలేకపోయారు. ఈ షోలో కామెడీ స్కిట్ లో ఎంత ముఖ్యమో.. జడ్జిలుగా వ్యవహరించే వారు కూడా అంతే ముఖ్యం. ఇప్పటివరకు నాగబాబు, రోజా ఈ షోని నడిపిస్తూ వస్తున్నారు. 

కేవలం కుర్చీలో కూర్చొని నవ్వడం మాత్రమే కాదు.. టీం మెంబర్స్ కి సలహాలు, సూచనలు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఈ షో నుండి నాగబాబు తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. షో నిర్వాహకులతో నాగబాబుకి వచ్చిన విభేదాల కారణంగా ఆయన షో నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రాలు డిజాస్టర్ కావాల్సింది.. బతికిపోయాయి.. ఎలాగంటే

దీంతో ఇప్పుడు జబర్దస్త్ టీమ్ కి షాక్ తగిలింది. నిజానికి గతంలో మాదిరి ఇప్పుడు షోకి టీఆర్పీ రేటింగ్స్ లేవు. కానీ యూట్యూబ్ లో మాత్రం చాలా పాపులారిటీ ఉంది. కోట్లలో వ్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ షోకి పోటీగా ప్రముఖ టీవీ ఛానెల్ ఓ కార్యక్రమం మొదలుపెట్టనుంది. అందులో ధనరాజ్, వేణు వంటి కమెడియన్లు స్కిట్ లు చేయడానికి సిద్ధమవుతున్నారు.

అలానే చమ్మక్ చంద్ర, ఆర్పీలు కూడా అక్కడికే వెళ్లిపోయారు. ఇలాంటి నేపధ్యంలో 'జబర్దస్త్' షోకి ఎట్రాక్షన్ గా ఉండే జడ్జిని తీసుకురావాలి. ఆ జడ్జి కోసం కూడా జనాలు షో చూడాలి. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీ షోలు చేసిన సాయి కుమార్, అలీ పేర్లతో పాటు నిర్మాత బండ్ల గణేష్ ను కూడా మల్లెమాల యూనిట్ సంప్రదిస్తోంది.

అలీ తనకు టైం సరిపోదని చెప్పినట్లు తెలుస్తోంది. సాయి కూడా నుండి ఎలాంటి స్పందన రాలేదు. బండ్ల గణేష్ బాబు చేయడానికి సముఖంగా ఉన్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది.