మరికొన్ని గంటల్లో 'సరిలేరు నీకెవ్వరు'  టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేశారు.

ఈరోజు సినిమా టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పబ్లిసిటీకి ఈ టీజర్ ఎంతో కీలకంగా మారింది. అయితే ఈ టీజర్ ఎలా ఉండబోతుందనే విషయంపై కొంత సమాచారం అందుతోంది. టీజర్ లో మహేష్ బాబు, విజయశాంతి, ప్రకాష్ రాజ్ లు కీలకంగా కనిపించనున్నారని తెలుస్తోంది.

బ్రహ్మానందంకి ఛాలెంజ్ విసిరిన బిత్తిరిసత్తి

ముగ్గురు మీద మూడు డైలాగులు ఉండే అవకాశం ఉంది. మహేష్ బాబు బోర్డర్ నుండి వస్తాడు కాబట్టి.. 'దేశ సరిహద్దుల్లో రక్షణ కోసం తాము కష్టపడుతుంటే, దేశంలోపల  మహిళలకు రక్షణ కరువు అవుతోంది' అనే అర్ధం వచ్చే విధంగా ఓ డైలాగ్ ఉంటుందని సమాచారం.

అలానే మహేష్ ని ఉద్దేశిస్తూ.. ప్రకాష్ రాజ్ 'సంక్రాంతికి అల్లుడు వస్తాడు అనుకుంటే మొగుడు వచ్చాడు' అని చెప్పే డైలాగ్ మహేష్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక విజయశాంతి నోటి వెంట కూడా పవర్ ఫుల్ డైలాగ్స్ వినిపిస్తాయని టాక్. ఈ టీజర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెబుతున్నారు.

కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. అనీల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.