బెనిఫిట్ షో ఎఫెక్ట్ : `అఖండ` థియేటర్ సీజ్
ఏపీలో టికెట్ల పెంపకంతో పాటు అదనపు షో వేసుకునేందుకు అనుమతి లేకుండా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రోజుకు కేవలం నాలుగు షోలు మాత్రమే వేయాలని.. అది కూడా సాధారణ టికెట్ రేట్లు మాత్రమే కొనసాగించాలని ఆదేశించింది.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా గురువారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో సందడిగా నెలకొంది. బాలయ్య ని బోయపాటి చూపించిన నెక్స్ట్ లెవెల్ మాస్ ప్రెజెంటేషన్ లో తనకి తానే సాటి అని మళ్ళీ ప్రూవ్ చేశారు. రెండు వేరియేషన్ లో కూడా బాలయ్య లోని మాస్ విశ్వరూపం దేనికదే డిఫరెంట్ గా సాలిడ్ ట్రీట్ ని అందించింది.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బెన్‌ఫిట్ షో వేశారనే కారణంతో రెవెన్యూ అధికారులు కృష్ణాజిల్లా మైలవరం సంఘమిత్ర థియేటర్‌లోని ఒక స్క్రీన్‌లో ప్రదర్శనను నిలిపివేశారు. జీవో.35 ప్రకారం రోజులు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉండగా యాజమాన్యం ఉదయం 8.30గంటలకు బెన్‌ఫిట్ షో వేసింది. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మైలవరం డిప్యూటీ తహసీల్దారు ముసునూరి శ్రీహరి ఽథియేటర్‌లో ఒక స్క్రీన్‌ను సీజ్ చేశారు. రెండు స్క్రీన్లలో రూల్స్ బ్రేక్ చేసిన స్క్రీన్ ని సీజ్ చేశామని.. మరో స్క్రీన్ ని యథాతథంగా రన్ అవుతోందని అధికారులు తెలిపారు. రోజుకు నాలుగు షోలకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఉందని వెల్లడించారు.
ఏపీలో టికెట్ల పెంపకంతో పాటు అదనపు షో వేసుకునేందుకు అనుమతి లేకుండా వైసీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రోజుకు కేవలం నాలుగు షోలు మాత్రమే వేయాలని.. అది కూడా సాధారణ టికెట్ రేట్లు మాత్రమే కొనసాగించాలని ఆదేశించింది. వీటికి విరుద్ధంగా వ్యవహరించింది సంఘమిత్ర థియేటర్ యాజమాన్యం షో వేసింది.
Also read “అఖండ” పై జూ.ఎన్టీఆర్ రివ్యూ, మహేష్ స్పందన
ధియేటర్ ను సీజ్ చేయడంతో ధియేటర్ యజమానులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఒకవేళ బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే, నాలుగు షోలతో మాత్రమే ఆపేయాలని, 5వ షో ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేసారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్లు అమ్మాలని తెలిపారు.
ఇదిలావుంటే.. అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ షాకింగ్ సంఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా థియేటర్లో పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు.
Also read Akhanda: బెనిఫిట్ షోలతో దోచేస్తున్నారు- కేతిరెడ్డి
వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది. షార్ట్ సర్క్యూట్ తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు.