అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం చక్కలు కొడుతోంది. ఈ సినిమాలో కథకు ఇల్లే కీలకం.

అలాంటి ఇంటి కోసం చాలానే వెతికారు. ఇల్లు ఇంటీరియర్ అంతా అన్నపూర్ణలో సెట్ వేశారు. కానీ బయట నుండి తీసే షాట్స్ లో అంతకంటే అందమైన ఇల్లు కావాలి.. దీనికోసం ముందు కొన్ని విదేశీ లొకేషన్లు చూశారు. బయట నుండి ఒకట్రెండు షాట్ లు తీస్తే చాలు.. దీనికి హైదరాబాద్ లోనే ఇల్లు దొరికింది.

'అల.. వైకుంఠపురములో'.. ఆ ఇల్లు ఎవరిదో తెలుసా..?

ఆ ఇల్లు ఎవరిదో కాదు.. ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి కూతురు రచన అత్తగారి ఇల్లు. ఎన్టీవీ చౌదరి వియ్యంకులు, హారిక హాసిని అధినేతలకు కూడా బంధువులే.. ఆ బంధుత్వంతో ఒకటి, రెండు రోజులు బయట నుండి షూట్ చేయడానికి.. సినిమాలో ఆ బంగ్లా చూపించడానికి అనుమతి దొరికింది.

సుమారు వంద కోట్ల ఖర్చుతో ఈ ఇంటిని కట్టుకున్నారు. ఈ ఇంటిని చూసిన బన్నీకి కూడా విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు. ఇంటికి సంబంధించిన పలు విషయాలను యజమానులను అడిగి తెలుసుకున్నాడని సమాచారం.

ఇప్పుడు అదే స్థాయిలో బంజారాహిల్స్ లో ఇంటిని నిర్మించుకోబోతున్నారు. తన కొత్తింటి ప్రస్తావనను ఇటీవల జరిగిన 'అల.. వైకుంఠపురములో' థాంక్స్ మీట్ లో మాట్లాడాడు బన్నీ.