తన పేరుతో అభ్యంతరకర వార్తలను ప్రచురిస్తూ మానసికంగా వేధిస్తున్నాడంటూ ఫ్లిన్ రెమెడియోస్ అనే వ్యక్తిపై సూపర్ మోడల్, మాజీ ఫెమినా మిస్ ఇండియా నటాషా సూరి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన లాయర్ మాధవ్ తో కలిసి బుధవారం నాడు కేసు నమోదు చేశారు.

తన పేరుతో పబ్లిక్ వెబ్ సైట్లలో అసభ్యకర పోస్ట్ లను ప్రచురిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019 నవంబర్ లో ఎవరో నకిలీ వార్తా కథనాలను సృష్టించి వాటిని తన పేరుతో ప్రచురించడం మొదలుపెట్టారని.. మొదట్లో వాటిని అంతగా పట్టించుకోలేదని.. ఆ తరువాత చాలా వార్తలు రావడంతో ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని అనిపించిందని చెప్పారు.

స్టేజ్ పై ఏడ్చేసిన రోజా.. వైరల్ అవుతోన్న వీడియో!

క్రమంగా అవి తారాస్థాయికి చేరాయని.. ఏకంగా తన పేరు మీద నకిలీ ట్విట్టర్ ఖాతాలు తెరిచి.. అభ్యంతరకర వార్తలను, బాత్రూమ్ లో ఉన్న అసభ్యకర అమ్మాయిల ఫోటోల ముఖాన్ని బ్లర్ చేసి వాటికి నటాషా సూరి సింగ్ అనే పేరుతో షేర్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

ఇదంతా కావాలనే ఎవరో చేస్తున్నారని తనకు అర్ధమైందని.. పోర్న్ సైట్లలో తలలేని శరీరాన్ని తీసుకొని వాటిని తన పేరుతో ప్రచురించడంతో గూగుల్ లో ఆ ఫోటోలు తనపేరుతో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అలానే బిగ్ బాస్ 13 కంటెస్టంట్ సిద్ధార్ద్ శుక్లా తనను వేధిస్తున్నట్లు నకిలీ వార్తలు ప్రచారం చేశారని తెలిపింది.

ఇప్పటివరకు తను సిద్ధార్థ్ ని కలవలేదని.. అతనెవరో కూడా తెలియడకు చెప్పారు. కావాలనే తనను వివాదాల్లోకి లాగుతున్నారని.. అందుకే కంప్లైంట్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2006లో ఫెమినా మిస్‌ ఇండియా (వరల్డ్‌) టైటిల్‌ గెలుచుకున్న నటాషా మిస్‌ వరల్డ్‌ పోటీలో టాప్‌-10లో  ఆమె నిలిచారు.