ప్రస్తుతం యువ దర్శకుల ప్రతిభకు షార్ట్ ఫిలిమ్స్ అద్దం పడుతున్నాయి. చాలా మంది యువ దర్శకులు లఘు చిత్రాల ద్వారా గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ కు చెందిన సునీల్ సత్యవోలు అనే పర్యావరణవేత్త ది సైలెంట్ వాయిస్ అనే షార్ట్ ఫిలిం నిర్మించారు. 

అన్షుల్ ఈ షార్ట్ ఫిలింకు దర్శత్వం వచించారు. 2:30 నిమిషాల నిడివి కల ఈ షార్ట్ ఫిలిం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే విధంగా ఉంది. మాటలు రాని 10 ఏళ్ల బాలిక తన స్కూల్ టీచర్ చేత ఓ బొమ్మ గీయిస్తుంది. ఆ చిన్నారి చెప్పినట్లుగా టీచర్ బొమ్మ గీస్తారు. బొమ్మ గీసిన తర్వాత ఆ ప్రదేశము తమ స్కూల్ వెనుకభాగంలోనిదే అని ఆమెకు అర్థం అవుతుంది. మా స్కూల్ పక్కన చెరువు దుర్వాసన వస్తోంది.. ఎవరైనా క్లీన్ చేయండి అని కూడా ఆ చిన్నారి రాస్తుంది. 

హైదరాబాద్ చుట్టపక్కల 300 చెరువులు ఉండగా దాదాపు 200 చెరువుల పరిస్థితి ఇదే విధంగా ఉందని ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు. పర్యావరణ కాలుష్యం గురించి ఆలోచించేలా, నదులని, చి చెరువుల్ని కాపాడుకోవాలనే సందేశాన్ని ఇచ్చేలా ఉన్న ఈ లఘు చిత్రం ఆకట్టుకుంటోంది. 

గుళ్లూ గోపురాలు అన్నారు.. మెగాస్టార్ ఏంటి ఇలా షాక్ ఇచ్చాడు!

ఈ లఘు చిత్రానికి అంతర్జాతీయ వేదికపై మంచి గౌరవం లభించింది. న్యూయార్క్ లో జరుగుతున్న లాంపా ఫిలిం ఫెస్టివల్ లో ఈ షార్ట్ ఫిలిం మొదటి బహుమతి గెలుచుకోవడం విశేషం.