పరాజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. కొరటాల శివ ఓ బలమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా కొరటాల శివ చిత్రాలంటే కమర్షియల్ అంశాలతో పాటు సందేశాత్మక అంశాలు కూడా ఉంటాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి చిత్రాలన్నీ ఆ కోవకు చెందినవే. 

కొరటాల శివ, చిరంజీవి చిత్రం ప్రారంభం అయ్యాక.. ఈ మూవీ దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతికి సంబంధించినదని ప్రచారం జరిగింది. చిరు ఈ మూవీ లో దేవాదాయ శాఖ ఉద్యోగిగా నటిస్తారని.. దేవాలయాలు, సంబంధించిన శాఖలో జరుగుతున్న అవినీతిపై రాజకీయ నాయకులతో పోరాటం చేస్తారని ప్రచారం జరిగింది. 

తాజాగా చిరు, కొరటాల మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ పిక్ లీకైంది. ఈ పిక్ లో చిరంజీవి పవర్ ఫుల్ లుక్ తో కనిపిస్తున్నారు. మేడలో ఎర్ర కండువా కూడా ఉంది. చిరంజీవి లుక్ ని గమనిస్తుంటే ఆయన నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దేవాలయాలకు సంబంధించిన కథ అని భావిస్తున్న తరుణంలో చిరు లుక్ షాకిచ్చే విధంగా ఉంది. 

కట్టలు తెంచుకున్న పవన్ హీరోయిన్ ఆగ్రహం.. కొంచెం మర్యాద నేర్పించండి!

కానీ మెగాస్టార్ పవర్ ఫుల్ గా కనిపిస్తుండడంతో మెగా అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నక్సలైట్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రాలేదు. అదే సమయంలో అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబుల పేర్లు కూడా వినిపిస్తుండడం విశేషం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ చిత్రాన్ని స్వరాలు సమకూరుస్తున్నారు.