అదేంటో కానీ తమిళ స్టార్ హీరో విజయ్ ప్రతీ సినిమాకు కాపీ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. పోస్టర్స్ నుంచి, సినిమా కథల దాకా కాపీ కొడుతున్నారంటూ అనేక వివాదాలు, కేసులు. అయితే విజయ్ ఎప్పుడూ వాటిలో తల దూర్చడు. తన పనేదో తనే చేసుకుంటాడు. అయితే దర్శకుడు ఇంత విమర్శలు వస్తున్నా..కాపీ కామెడీ చేయటం మానటం లేదు. అదే సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆయన తాజా చిత్రం  ‘మాస్టర్’ కి సైతం ఈ కాపీ సమస్యలు తప్పలేదు. అయితే మరీ ఘోరం ఏమిటంటే తెలుగులో వచ్చిన రాజుగారిగది-3 పోస్టర్ కాపీ కొట్టారంటూ మీడియాలో వార్తలు వస్తూండటమే. అయితే రెండు పోస్టర్స్ దగ్గరపెట్టి చూస్తే నిజమే అనక తప్పదు.

దళపతి విజయ్ హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న తమిళ సినిమా ‘మాస్టర్’.. ‘మా నగరం’, ‘ఖైదీ’ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా కాగా ఆండ్రియా, శాంతను కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇద్దరు విజయ్ ల రక్తపాతం.. బాహుబలిని తలపించేలా..!
 
ఈ సినిమాకు సంభందించి ఇప్పటి వరకు విడుదల చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా  ఈ సినిమా నుండి మూడో లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఓ వైపు దళపతి, మరోవైపు సేతుపతి ముఖాలపై గాయాలతో కనిపించారు. ఇద్దరూ ఎదురెదురుగా ఒకరిని చూసి మరొకరు అరుస్తూ ఉన్నారు.  
 
తెలుగులో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది-3’ పోస్టర్ లుక్‌ను సేమ్ టూ సేమ్ కాపీ పేస్ట్ చేసేసినట్లుగా ఈ పోస్టర్ ఉండటం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ రెండు పోస్టర్స్ ను పక్క పక్కనెట్టి రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లు విజయ్ ని, దర్శకుడుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.

మరి ఈ కాపీ పేస్ట్ వ్యవహారంపై డైరెక్టర్ లేదా హీరో రియాక్టయ్యి అవుతారో లేదో చూడాలి.  ఇద్దరు విజయ్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మ్యూజిక్ : అనిరుధ్, సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్.