తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో నటిస్తున్నాడు. గత ఏడాది విడుదలైన ఖైదీ చిత్రంతో లోకేష్ కనకరాజ్ భారీ హిట్ సొంతం చేసుకున్నాడు. పాటలు, హీరోయిన్ లేకుండా ఖైదీ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేశాడంటే అతడి ప్రతిభని అర్థం చేసుకోవచ్చు. 

లోకేష్ కనకరాజ్, విజయ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి మాస్టర్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెకెక్కబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవిక మోహన్, ఆండ్రియా నటిస్తున్నారు. ప్రతినాయకుడి పాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. 

తాజాగా మాస్టర్ చిత్రం నుంచి థర్డ్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. విజయ్ సేతుపతి, విజయ్ ఫేస్ టూ ఫేస్ తలపడుతూ రక్తంతో, గాయాలతో కనిపిస్తున్న ఈ పోస్టర్ అద్భుతంగా ఉంది. 

హార్దిక్ పాండ్య గర్ల్ ఫ్రెండ్ బికినీ ఫొటోస్.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ బ్యూటీ

ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు లుక్స్ లో విజయ్ నే చూపించారు. థర్డ్ లుక్ లో విజయ్ సేతుపతిని కూడా దర్శకుడు రివీల్ చేశాడు. కొందరు అభిమానులు మాస్టర్ థర్డ్ లుక్ బాహుబలిని తలపించే విధంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి 2 చిత్రంలో క్లైమాక్స్ ఫైట్ లో ప్రభాస్, రానా ఇదే తరహా పోరాటంలో కనిపిస్తారు. 

మాస్టర్ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెసర్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.