టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అందులో ఆమె తీవ్రవాదిగా కనిపించనుందని సమాచారం. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన 'ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ లో భాగంగా రెండో సీజన్ రాబోతుంది.

దీనికోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. ఎన్నడూ లేని విధంగా టెర్రరిస్ట్ అవతారం ఎత్తబోతుంది. పెళ్లికి ముందు వరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో నటించిన సమంత ఇప్పుడు పూర్తిగా తన పంథా మార్చుకుంది.

సరిలేరు నీకెవ్వరు: వంశీ పైడిపల్లికి మహేష్ రిక్వెస్ట్

అభిమానులు ఆమెని గ్లామర్ పాత్రల్లో చూడడానికి సిద్ధంగానే ఉన్నా.. తను మాత్రం నటనకు అవకాశం ఉన్న భిన్నమైన పాత్రల్లో నటించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో  'యూటర్న్', 'మజిలీ', 'ఓ బేబీ' వంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు మంచి సక్సెస్ కావడంతో సమంతలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది.

దీంతో గతంలో మాదిరి కమర్షియల్ సినిమాల్లో చేయనని, ఇకపై తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం తమిళంలో ఘన విజయం సాధించిన '96' తెలుగు రీమేక్ లో సమంతనటిస్తోంది. నటన ప్రధానంగా నడిచే చిత్రమిది. తమిళంలో త్రిష పోషించిన పాత్రలో సమంత నటించింది.

ఈ సినిమా తప్ప సమంత మరే సినిమా కమిట్ అవ్వలేదు. దీనికి కారణం అవకాశాలు లేక కాదు.. రొటీన్ సినిమాలు చేయడం ఇష్టంలేక.. కమర్షియల్ కథలతో తన వద్దకు వస్తోన్న దర్శకనిర్మాతలను వెనక్కి పంపించేస్తుందట. అంతేకాదు.. కొత్తగా ఆలోచించమని వారికి సలహాలు ఇస్తోందట.