సినిమా చేస్తున్నప్పుడు దర్శకులకు, హీరోకు మధ్య ఒక్కోసారి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్ ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది. అలా తన దర్శకులతో రిలేషన్ మెయింటైన్ చేసే హీరోల్లో మహేష్ ఒకరు. ఆయనతో పనిచేసిన వారంతా దాదాపు టచ్ లోనే ఉంటూంటారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ డైరక్టర్స్ సూచనలు, సలహాలు కూడా తీసుకుంటూంటారు.

ఇదే పద్దతిలో రీసెంట్ గా తనకు మహర్షి వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో సైతం మహేష్ స్నేహం కొనసాగిస్తున్నారు. ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యిపోయారు. మహేష్ సినిమా సెట్స్ కు వెళ్లి మరీ కలుస్తున్నారు వంశీ పైడిపల్లి. ఆయన తదుపరి సినిమా మహేష్ తోనే అనే టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో  'సరిలేరు' కు సైతం ఆయన సేవలను వాడుకుంటున్నట్లు మీడియా వర్గాల సమాచారం.  

సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  ఫన్ - యాక్షన్ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'.  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాపిడ్ స్పీడుతో జరుగుతోంది. అదే స్పీడులో ఈ సినిమాకు సంబంధించిన వార్తలు,గాసిప్స్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో వార్త ...సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు వంశీ పైడిపల్లి.. 'సరిలేరు' సినిమాకు సంభందించిన ఎడిటింగ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని వినికిడి. మహేష్ రిక్వెస్ట్ పై ఆయన ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినట్లు చెప్తున్నారు. అంతేకాకుండా సినిమాలో యాక్షన్ సీన్స్ కు సంభందించి కొన్ని కీ పాయింట్స్ ని సైతం డైరక్టర్ కు సజెస్ట్ చేసారని చెప్తున్నారు. రష్మిక మందణ్న హీరోయిన్ గా... చేస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి... దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై... రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకానుంది.