టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లిన తాప్సీ అక్కడ సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. వరుసగా హిట్ల మీద హిట్లు అందుకుంటోంది. ఈ బ్యూటీ నటిస్తోన్న మరి వైవిధ్యమైన చిత్రం 'తప్పడ్'.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. తాను విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని లాయర్ కి చెబుతూ తాప్సీ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. 'మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లాడానికి మీ భర్త నుండి కోర్టు నోటీసులు వచ్చాయని' లాయర్ చెప్పగానే.. 'నేను వెళ్ళను' అంటూ తాప్సీ బదులిస్తుంది.

స్టార్ హీరోలకు నో చెప్పా.. అది ప్రమాదమే: హీరోయిన్ తాప్సి

'మీ భర్తకి ఏమైనా అఫైర్ ఉందా..?' అని లాయర్ అడగ్గా.. 'నో' అని చెబుతుంది తాప్సీ. 'మీకేమైనా ఎఫైర్ ఉందా..?' అని లాయర్ అడిగితే.. దానికి కూడా 'నో' అంటుంది. 'కేవలం పార్టీలో చెంపదెబ్బ కొట్టారనే.. మీరు మీ భర్త నుండి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా..?' అని లాయర్ ఆశ్చర్యంగా ప్రశ్నించగా.. 'అది కేవలం చెంపదెబ్బ మాత్రమే కాదు' అంటూ తాప్సీ చెప్పే డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇద్దరు భార్య, భర్తల మధ్య జరిగే కథగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అనుభవ్ సుశీల సిన్హా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.