సొట్టబుగ్గల సుందరి తాప్సి ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సక్సెస్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ తాప్సికి టాలీవుడ్ లో మంచి క్రేజే వచ్చింది. కానీ నటిగా ఎదగడం కోసం తాప్సి బాలీవుడ్ కు వెళ్ళింది. ప్రస్తుతం తాప్సికి బిటౌన్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 

కరీనా కపూర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ రేడియో కార్యక్రమంలో తాప్సి ఇటీవల పాల్గొంది. కరీనా కపూర్ ఈ షోలో తాప్సి ని అనేక ప్రశ్నలు అడిగింది. అగ్ర హీరోల చిత్రాలని తిరస్కరించడం సురక్షితమా, ప్రమాదమా అని కరీనా ప్రశ్నించగా.. తాప్సి ప్రమాదం అని బదులిచ్చింది. 

అగ్ర హీరోల సినిమాలకు నో చెప్పడం ప్రమాదమే. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం ఉంటుంది. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. రెండు మూడు అగ్ర హీరోల చిత్రాలని తిరస్కరించా. కొన్ని సార్లు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాం అని భాదపడవచ్చు. 

43 ఏళ్ల బ్యూటీ బోల్డ్ ఫోజులు.. ఇంటర్నెట్ లో సెగలు!

తమపై ఏమైనా ద్వేషంతో ఈ నిర్ణయం తీసుకుందా అని కూడా హీరోల భావించే అవకాశం ఉంది. నేను మాత్రం వారిని వ్యక్తిగతంగా కలసి సినిమా వదులుకోవడానికి గల కారణాలు చెప్పా. వారు అర్థం చేసుకున్నారు. ఒక వేళ వారు అర్థం చేసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అని తాప్సి పేర్కొంది. 

ప్రస్తుతం తాప్సి ఇండియన్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ చిత్రంలో నటిస్తోంది. శభాష్ మిథు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలయింది. ఫస్ట్ లుక్ లో క్రికెటర్ గా కనిపిస్తున్నా తాప్సికి ప్రశంసలు దక్కుతున్నాయి.